Chiranjeevi : సమంతకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి దంపతులు.. మెగా బంగారం మూమెంట్.. ఫోటోలు వైరల్..
మా ఇంటి బంగారం మూవీ మంచి విజయాన్ని సాధించడంతో హీరోయిన్ సమంతతో పాటు చిత్ర బృందాన్ని ఇంటికి పిలిచి అభినందించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)

సమంత నటించిన మా ఇంటి బంగారం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి మా ఇంటి బంగారం చిత్ర బృందాన్ని ఇంటికి పిలిచి అభినందించారు.

ఈ సందర్భంగా సమంత దంతపతులకు నూతన వస్త్రాలతో పాటు బహుమతిని అందించారు. ఆ జంటతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఇదే విషయాన్ని నటి సమంత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చిరంజీవికి ధన్యవాదాలను తెలియజేశారు.

మీరు చూపించిన ఆదరణ, మద్దతుకు ఎంతో కృతజ్ఞతలు. మీ ప్రశంసలకు మా చిత్ర బృందం ఎంతో సంతోషిస్తోందని తెలిపింది.

అయితే.. కొందరు మాత్రం సమంత తల్లి కాబోతుండడంతో చిరు దంపతులు సారె పెట్టారని కామెంట్లు చేస్తున్నారు.
