Chiranjeevi – Pawan Kalyan : రిసెప్షన్ వేడుకలో అన్నయ్యని పరామర్శించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్య చిరంజీవిని తక్కువగా కలుస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఫంక్షన్ లో లేదా ఏదైనా పండగల టైంలో చిరంజీవి ఇంట్లో కలుస్తున్నారు. మెగాస్టార్ పవర్ స్టార్

Chiranjeevi – Pawan Kalyan :  రిసెప్షన్ వేడుకలో అన్నయ్యని పరామర్శించిన పవన్ కళ్యాణ్

Chiru Pawan

Updated On : October 25, 2021 / 2:35 PM IST

Chiranjeevi – Pawan Kalyan :  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక అన్నయ్య చిరంజీవిని తక్కువగా కలుస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక ఫంక్షన్ లో లేదా ఏదైనా పండగల టైంలో చిరంజీవి ఇంట్లో కలుస్తున్నారు. మెగాస్టార్ పవర్ స్టార్ కలిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరు. వాళ్ళని కలిసి ఒకేసారి చూడాలి అనుకుంటారు అభిమానులు. మొన్న ఎప్పుడో రాఖీ పండగ రోజు చిరంజీవి ఇంట్లో కలిశారు. మళ్ళీ వీళ్లిద్దరు ఇప్పటిదాకా కలవలేదు. తాజాగా ఓ రిసెప్షన్ వేడుకలో కలిశారు.

Mahathi Swara Sagar : సింపుల్ గా మణిశర్మ తనయుడి వివాహం

ఇటీవల చిరంజీవి చేతికి సర్జరీ అయిన సంగతి తెలిసిందే. చేతికి ఇంకా ఆ కట్టు ఉంది. ఆ కట్టుతోనే అన్ని ప్రోగ్రామ్స్ కి హాజరు అవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లు హాజరయ్యారు. ఇద్దరూ ఈ వేడుకలో ఒకర్నొకరు చూసుకొని మాట్లాడుకున్నారు. చిరంజీవి చేతి సర్జరీ గురించి తెలుసుకొని ఆ వేడుకలో ప్రత్యక్షంగా పరామర్శించారు పవన్. చాల రోజుల తర్వాత వీళ్లిద్దరు మళ్ళీ కలవటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.