Tollywood Stars : మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. అంతా ఒకే దగ్గర.. చిరు, మహేష్, చరణ్, నాగ్..

మన టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Tollywood Stars : మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. అంతా ఒకే దగ్గర.. చిరు, మహేష్, చరణ్, నాగ్..

Chiranjeevi Nagarjuna Ram Charan Mahesh Babu Tollywood Stars Enjoying in Maldives Photo goes Viral

Updated On : November 7, 2024 / 7:58 PM IST

Tollywood Stars : టాలీవుడ్ లోని సెలబ్రిటీలు, ముఖ్యంగా మన హీరోలు కలిసి కనిపిస్తే ఆ కిక్కు వేరే లెవల్. ఫ్యాన్స్ అయితే హీరోలు కలిసి కనిపిస్తే ఆ ఫోటోలను వైరల్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ఒకేచోట కలిసి కనిపించారు. మన టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also Read : Aha OTT : యువ రచయితలకు ఆహా ఓటీటీ ఆహ్వానం.. మీ దగ్గర ట్యాలెంట్ ఉంటే ట్రై చేయండి..

చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, మహేష్ బాబు, ఉపాసన, నమ్రత.. ఇలా పలువురు స్టార్స్ అంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో వైరల్ గా మారింది. వీరంతా కలిసి ఇండస్ట్రీకి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఇచ్చిన ప్రైవేట్ పార్టీకి మాల్దీవ్స్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. మాల్దీవ్స్ లో వీరంతా కలిసి తినడానికి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం మన స్టార్స్ అంతా మాల్దీవ్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Chiranjeevi Nagarjuna Ram Charan Mahesh Babu Tollywood Stars Enjoying in Maldives Photo goes Viral

ఇలా చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్.. స్టార్స్ అంతా ఒకేచోట కనపడటంతో టాలీవుడ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తపరుస్తూ ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.