Chiranjeevi : క్లీంకార విషయంలో చిరు చెప్పింది నిజమేనా..? కోకాపేట భూముల ధరకు మెగా వారసురాలికి సంబంధం..!

రామ్ చరణ్ కూతురు క్లీంకార విషయంలో చిరు చెప్పిందే నిజమైంది. మెగా వారసురాలి రాకతో కోకాపేట భూముల ధర..

Chiranjeevi : క్లీంకార విషయంలో చిరు చెప్పింది నిజమేనా..? కోకాపేట భూముల ధరకు మెగా వారసురాలికి సంబంధం..!

Chiranjeevi Ram Charan Klin Kaara Kokapet land cost

Chiranjeevi : ఇటీవల మెగా ఇంట వారసురాలు అడుగుపెట్టడంతో ఇటు ఫ్యామిలీ, అటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. జూన్‌ 20న ఉపాసన, రామ్ చరణ్ (Ram Charan) పండంటి ఆడబిడ్డకు తల్లిదండ్రులు అయ్యినట్లు ప్రకటించారు. ఇక ఈ మెగా ప్రిన్సెస్ బర్త్ గురించి చిరంజీవి మీడియా ముందు మాట్లాడుతూ.. పాప మంచి ఘడియల్లో పుట్టిందని, జాతకం కూడా అధ్బుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. పాప జాతకం వలనే గత కొంతకాలంగా తమ ఇంటిలో అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నాయని వెల్లడించాడు.

Avatar : అవతార్, కల్కి మధ్య ఉన్న కనెక్షన్ ఇదే.. దర్శకుడు జేమ్స్ కామెరాన్ చెప్పిన మాటలు..

ఈ క్రమంలోనే చరణ్ RRR తో గ్లోబల్ క్రేజ్ సంపాదించుకోవడం, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ వంటి సంతోషకరమైన విషయాలు పాప జాతకం వల్లే అని తాను నమ్ముతున్నట్లు చిరు చెప్పుకొచ్చాడు. అయితే అప్పుడు ఆ మాటలు కొంచెం అతిశయోక్తి అనిపించినప్పటికీ ఇప్పుడు మాత్రం అవి అక్షరాలా నిజమనిపిస్తున్నాయి. ఎందుకంటారా..? ఇటీవల హైదరాబాద్ లోని కోకాపేట భూములు ధరలు 100 కోట్ల పైబడి పలకడం అందరికి తెలిసిన విషయమే. కాగా చిరంజీవి కూడా అక్కడ కొంత స్థలం ఉన్నట్లు గతంలో స్వయంగా చిరునే తెలియజేశాడు.

Krishna : బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కుటుంబ సభ్యులు.. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు..!

గతంలో చిరంజీవి వ్యవసాయం చేసేందుకు అక్కడ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఆ భూమిలో కొంత భాగాన్ని చిరు తన సతీమణి సురేఖ ఆలోచన మేరకు రాఖి కానుకగా తన చెల్లెళ్లకు ఇచ్చాడు. ఈ విషయాన్ని ఉమెన్స్ డే నాడు చిరంజీవి ఒక ప్రోగ్రామ్ లో తెలియజేశాడు. అప్పుడు ఆ భూములు విలువ సుమారు 30 కోట్లు ఉంది. అయితే ఇప్పుడు ఆ భూములు విలువ 100 కోట్ల వరకు చేరుకుంది. దీనిబట్టి చూస్తే ఇప్పుడు అక్కడ ఉన్న చిరంజీవి భూమి విలువ దాదాపు 1500 కోట్లు పలకవచ్చు. వ్యవసాయం కోసం కొన్న భూములు నేడు కోట్లు తెచ్చుపెడుతున్నాయి అంటే అది మెగావారసురాలు క్లీంకార (Klin Kaara) వలనే అని, అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలు అక్షరాలా సత్యమని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.