అమ్మతో.. అంజనాపుత్రుడు చిరంజీవి: ఫోటోలు వైరల్

చిరంజీవే.. అయినా అమ్మకు కొడుకే కదా? ఇదేదో సినిమాలో డైలాగ్… ఆయన ఓ మెగాస్టార్.. తెలుగు సినిమా రంగంలో ఎదరురలేని చిరంజీవి.. అటువంటి చిరంజీవిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన మెగాస్టార్ తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తల్లి బర్త్ డే సెలబ్రేషన్స్‌ని ఘనంగా నిర్వహించారు చిరంజీవి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తల్లి చేత కేక్ కటింగ్ చేయించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తల్లి అంజనీదేవి అంటే ఈ అంజనీ పుత్రుడు చిరంజీవికి అమితమైన ప్రేమ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మకుటం లేని మహరాజుని అందించిన అంజనా దేవితో.. కుమారుడు చిరంజీవి సెల్ఫీ తీసుకున్నాడు. తనతో ఒక్క ఫోటో కోసం ఎందరో అభిమానులు ఎదురుచూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి చిరంజీవి తన తల్లితో మురిసిపోతూ సెల్ఫీ తీసుకుని ఆనందపడ్డారు.
ఈ ఫొటోలలో చిరంజీవి, ఆయన భార్య సురేఖ, పెద్ద కూతురు సుస్మితతో పాటు మెగా సిస్టర్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు చిరంజీవి. అమ్మ పుట్టిన రోజు మాత్రం ఘనంగా చేశాడు. రోజంతా ఆమెతోనే సరదాగా గడిపాడు చిరు. ఫోటోల్లో మనవళ్లు, మనవరాళ్లు, కొడుకుతో కలిసి అంజనా దేవి కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు.