Chiranjeevi : అభిమానం చూపించడమే కాదు.. చిరంజీవి కామెంట్స్.. చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. (Chiranjeevi)
Chiranjeevi
Chiranjeevi : కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. బేబీ, కలర్ ఫోటో టీమ్ నుంచి వస్తుండటం, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మెప్పించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చెన్నై లవ్ స్టోరీ సినిమా జులై 24న రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు.
Also Read : Spider Man Brand New Day : ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఫైనల్ ట్రైలర్ రిలీజ్.. తెలుగులో కూడా..
ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. చెన్నై లవ్ స్టోరీ అనగానే నా చెన్నై రోజులు గుర్తొచ్చాయి. చెన్నైతో నాకు ఉన్న అనుబంధం గుర్తుంది. చెన్నైలో ఇక్కడ కదా మన బతుకు తెరువు, మన ఫ్యూచర్, మనం పేరును సంపాదించుకోవాలి కదా అని చెన్నై రోడ్ల మీద తిరిగాను. అక్కడ రోడ్ల మీద నడిచి.. అక్కడే కార్లలో తిరిగాను. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం నా అభిమానులే. SKN, సాయి రాజేష్, డైరెక్టర్ రవి, కిరణ్ అబ్బవరం అన్నయ్య నా అభిమాని. కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని, మణిశర్మ.. వీళ్లందరి కోసం, వీళ్ళ అభిమానం ఇక్కడికి రప్పించింది. నా అభిమానులను ఇష్టపడతాను. కానీ వాళ్ళు పైకొస్తే, ప్రయోజకులు అయితే, నన్ను ప్రేరణ గా తీసుకుంటే, అందరూ గర్వించే స్థాయికి ఎదిగారు అంటే ప్రాణంగా చూసుకుంటాను. అలాంటి తమ్ముళ్లను చూసి గర్వపడతాను. ఇవాళ స్టేజి మీద ఇంతమంది అభిమానులను చూసి ఆనందంగా ఉన్నాను. అందుకే ఇవాళ వచ్చాను.
అభిమానులు కేవలం అభిమానం చూపించడమే కాదు ప్రేరణగా తీసుకొని పైకి రావాలి. SKN, సాయి రాజేష్ లాంటి వాళ్ళు ఏమి లేకుండా వచ్చి ఎదిగారు. ఈ డైరెక్టర్ నా గురించి బాగా మాట్లాడాడు అని చెప్పారు. నేను రాకముందే మాట్లాడేసాడు. నేను వెళ్ళాక ఆ స్పీచ్ వింటాను. వీళ్ళు అంతా మాములు స్థాయి నుంచి వచ్చి కలలు కని ఈ స్థాయికి వచ్చారు. ఇక్కడ కష్టాలు, అవమానాలు చాలా ఉంటాయి అన్ని ఉన్నా సక్సెస్ అవుతారు కష్టపడితే. నేను అయ్యాను, నా అభిమానులు అయ్యారు. ఒకే ఒక జీవితం ఇది. పెద్ది సినిమా రిలీజ్ అయ్యాక పుత్రోత్సాహం అనుభవిస్తున్నా. మీరు కూడా మీ తల్లితండ్రులు గర్వపడేలా చేయండి. సినీ పరిశ్రమకే రావాలని నేను అనను. మీ మీ రంగాల్లో ఎదగండి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్న పరిశ్రమలో నేను ఏ ధైర్యంతో వచ్చానో తెలీదు కానీ వచ్చాను. వాళ్ళ నుంచి ప్రత్యేకంగా కనిపించాలి అని కష్టపడ్డాను. అలాగే కిరణ్ అబ్బవరం కూడా వచ్చాడు. ఎక్కడో రాయచోటిలో పుట్టి తిరుపతిలో సినిమాలు చూసి అక్కడ్నుంచి ఈ రేంజ్ కి ఎదిగాడు. అలాంటి కొత్తవాళ్లు రావాలి అని అన్నారు.
అలాగే.. మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేకపోతే నేను లేను. నేను డ్యాన్సులు చేశాను అంటే వాళ్ళ మ్యూజిక్ వల్లే అని తెలిపారు. అలాగే మూవీ యూనిట్ లో పలువురి గురించి మాట్లాడి అందరికి అల్ ది బెస్ట్ తెలిపారు.
