Chiranjeevi : చాలా గ్యాప్ తర్వాత ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో రాబోతున్న మెగాస్టార్
చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి పాత సినిమాలు చూస్తే మనకే అర్ధమవుతుంది. ఆయన ఫుల్ రేంజ్ లో కామెడీ సినిమా తీసి చాలా సంవత్సరాలు అవుతుంది. దీంతో చిరంజీవిలోని
Chiranjeevi : స్టార్ హీరోలంతా ఒక్కో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తుంటే చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత వచ్చినా ‘సైరా’ సినిమా తర్వాత నుంచి వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్ సినిమాలు షూటింగ్ ని మొదలు పెట్టగా బాబీ దర్శకత్వంలో మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు. తాజాగా చిరు మరో సినిమాని ఓకే చేసినట్టు సమాచారం.
Pushpa : వెయ్యి మంది డ్యాన్సర్లతో పుష్ప స్పెషల్ సాంగ్
డైరెక్టర్ మారుతి కొత్త కొత్త కథలకి పూర్తిగా వినోదాన్ని జోడించి సినిమా తీస్తారు. ఆయన అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. నిన్న దీపావళి రోజు మారుతి తీసిన ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి మంచి టాక్ వస్తుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మారుతి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా తన నెక్స్ట్ సినిమాల గురించి కూడా తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాని చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవికి ఓ కథని వినిపించినట్టు చెప్పారు. తన కథకు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని, కథ నచ్చింది అని చెప్పి పూర్తి స్క్రిప్ట్ ని సిద్దం చేయమని చెప్పారన్నారు. మారుతి సినిమాలంటే పక్కా కామెడీ ఫుల్ గా ఉంటుంది. చిరంజీవితో కూడా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా ప్లాన్ చేయబోతున్నట్టు సమాచారం.
Unstoppable With NBK : బాలకృష్ణ షోలో చంద్రబాబు గురించి ప్రశ్నించిన మోహన్ బాబు
చిరంజీవి కామెడీ టైమింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. చిరంజీవి పాత సినిమాలు చూస్తే మనకే అర్ధమవుతుంది. ఆయన ఫుల్ రేంజ్ లో కామెడీ సినిమా తీసి చాలా సంవత్సరాలు అవుతుంది. దీంతో చిరంజీవిలోని కామెడీ టైమింగ్‌ను మారుతి బాగా వాడుకొని మంచి కామెడీ ఎంటర్టైనర్ ని ఇస్తారని అభిమానులు అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మారుతీ ‘పక్కా కమర్షియల్’ సినిమా అయ్యాక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.