కదిలిన సినీ రంగం – భారీగా విరాళాల ప్రకటన..

కరోనా ఎఫెక్ట్ : భారీగా విరాళాలు ప్రకటించిన్ సినీ ప్రముఖులు..

  • Published By: sekhar ,Published On : March 26, 2020 / 11:22 AM IST
కదిలిన సినీ రంగం – భారీగా విరాళాల ప్రకటన..

Updated On : March 26, 2020 / 11:22 AM IST

కరోనా ఎఫెక్ట్ : భారీగా విరాళాలు ప్రకటించిన్ సినీ ప్రముఖులు..

కరోనా మ‌హ‌మ్మారిపై పోరాటానికి తెలుగు చిత్ర‌సీమ నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. తమ వంతు సాయం అందించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వి.వి.వినాయక్ తదితరులు తమ వంతు విరాళం ప్రకటించారు. తాజాగా డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి రెండు తెలుగు రాష్ట్రాల‌కు త‌న వంతుగా మొత్తం రూ. 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి స‌హాయ నిధుల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌లు అంద‌జేస్తున్న‌ట్లు గురువారం ట్వీట్ చేశారు. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రెండు తెలుగు రాష్ట్రాల‌కు 10 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ‘‘ప్ర‌జ‌లంద‌రూ సామాజిక దూరం పాటిస్తూ, ఇళ్ల‌ల్లో ఉండి లాక్‌డౌన్ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలని’’ కోరారు.
 ఈ పోరాటంలో ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ క‌రోనా నివార‌ణా చ‌ర్య‌ల కోసం రూ.20ల‌క్ష‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్లు దిల్‌రాజు, శిరీష్ తెలిపారు.

‘‘క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) కార‌ణంగా అంతర్జాతీయ విప‌త్తు ఏర్ప‌డింది. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అందించాలి. అది ఎంత చిన్న‌దైనా కావ‌చ్చు. అందులో భాగంగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ క‌రోనా నివార‌ణా కోసం తెలంగాణ రాష్ట్రానికి రూ.10 ల‌క్షలు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.10 ల‌క్ష‌లు నివార‌ణ చ‌ర్య‌ల నిమిత్తం 20 ల‌క్ష‌లు విరాళంగా అందిస్తుంది. క‌రోనా వైర‌స్ నివార‌ణ కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అభినందిస్తున్నాం’’ అని దిల్‌రాజు, శిరీష్ తెలిపారు. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ధనుష్, శివ కార్తికేయన్, దర్శకులు శంకర్, కార్తీక్ సుబ్బరాజు తదితరులు పేద కళాకారులను ఆదుకోవడానికి తమవంతు సాయం ప్రకటించారు.