Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
తెలుగు బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ రిజిస్టర్ అయ్యింది. ఈ షోను(Bigg Boss 9 Telugu) తక్షణమే నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు.

Complaint filed at Jubilee Hills Police Station demanding ban on Bigg Boss show in Telugu
Bigg Boss 9 Telugu: తెలుగు బిగ్ బాస్ షోపై పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ రిజిస్టర్ అయ్యింది. ఈ షోను తక్షణమే నిలిపివేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పలువురు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఇంకా విషయం గురించి వారు మాట్లాడుతూ.. ” బిగ్ బాస్ షో అనేది సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉంటోంది. అసలు ఏమాత్రం కుటుంబ విలువలను పాటించని దివ్వెల మాధురి, రీతు చౌదరి లాంటి వ్యక్తులను బిగ్ బాస్ షోలోకి తీసుకొచ్చి సమాజానికి ఎలాంటి (Bigg Boss 9 Telugu)సందేశం ఇద్దామనుకుంటున్నారు. ఇటీవల కర్ణాటకలో చేసినట్టుగా ఇక్కడ కూడా బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలి. లేదంటే, మహిళ సంఘాలు, ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌసును ముట్టడిస్తామని వారు హెచ్చరిక. అలాగే, బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nithin: ఉన్న ఒక్క సినిమా కూడా పోయింది.. విక్రమ్ కూడా పక్కన పెట్టేశాడు.. పాపం నితిన్..
ఇక బాగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ గతంలో చాలానే ఫిర్యాదుల అందాయి. ఇది సమాజ వ్యవహారాలకు విరుద్ధంగా ఉందని, ఆడామగా ఒకేచోట కలిసి ఉండటం ఏంటి అంటూ గతంలో చాలా మంది కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అయినప్పటికీ షోను ఇంకా నడిపిస్తునే ఉన్నారు. మరి తాజాగా అందిన ఈ ఫిర్యాదుతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది చూడాలి.