సహజీవనం తప్పుకాదు : సాయిపల్లవి

ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా.. సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి అంటోంది.

  • Published By: sreehari ,Published On : December 30, 2018 / 12:22 PM IST
సహజీవనం తప్పుకాదు : సాయిపల్లవి

Sai Pallavi (Image:Instagram)

Updated On : December 30, 2018 / 12:22 PM IST

ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా.. సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి అంటోంది.

ఓ అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోకుండా.. సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి అంటోంది. ఒకేరోజు సాయిపల్లవి నటించిన ‘మారి-2’, ‘పడిపడిలేచె మనసు’ విడుదలకాగా, సంతోషంగా ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఎవరితోనైనా కలిసుంటున్నారా? వంటి ప్రశ్నలు ఇటీవలి కాలంలో తనకు ఎక్కువయ్యాయని, తనకు లివింగ్ టుగెదర్ సంబంధం వద్దని అంతమాత్రాన సహజీవనానికి వ్యతిరేకినని చెప్పబోవడం లేదని అంది. తాను వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని చెప్పింది. తాను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని, నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాగా, సాయిపల్లవి సూర్యతో కలసి నటించిన ‘ఎన్జీకే’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఇదే సమయంలో మలయాళంలో ఫాహత్ ఫాజిల్ పక్కన మరో సినిమా కూడా చేస్తోంది.