రాజమౌళి కొడుకు పెళ్లి : జైపూర్‌కు టాలీవుడ్ స్టార్స్ క్యూ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి 2019, డిసెంబర్ 30న జైపూర్‌లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం టాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు.

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 07:55 AM IST
రాజమౌళి కొడుకు పెళ్లి : జైపూర్‌కు టాలీవుడ్ స్టార్స్ క్యూ

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి 2019, డిసెంబర్ 30న జైపూర్‌లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం టాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు.

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి 2019, డిసెంబర్ 30న జైపూర్‌లో జరగనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం టాలీవుడ్ హీరోలంతా ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి జైపూర్ వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసన.. ఎన్టీఆర్-ప్రణతితోపాటు నాని కూడా ఫ్యామిలీతో సహా బ్యాగ్ సర్దేశారు. ఇక రానా కూడా సోలోగా ఓ బ్యాగ్ సర్దుకున్నాడు. జైపూర్ సమీపంలోని కూకాస్‌లో ఉన్న ఓ స్టార్ హోటల్‌లో కార్తికేయ, పూజ పెళ్లి గ్రాండ్‌గా జరగనుంది.

అటు రాజమౌళి తన కుటుంబంతో కలిసి ఇప్పటికే జైపూర్ చేరుకున్నాడు. వీళ్లతో పాటు ప్రభాస్-అనుష్క కూడా మిగతా హీరోల కంటే ముందే జైపూర్ వెళ్లిపోయారు. సాయంత్రం హోటల్‌కు చేరుకున్న చరణ్, ఎన్టీఆర్‌ లాంటి స్టార్స్ అందరికీ ప్రభాస్, అనుష్క, రాజమౌళి స్వయంగా స్వాగతం పలికారు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అతిథులతో కలిసి హీరో ప్రభాస్ డ్యాన్స్ చేసి అలరించాడు.