సాగరతీరాన సరిగమల వేడుక
ఈనెల 30వ తేదీ (రేపు), ఎఫ్2 ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వేదికైంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి, ఎఫ్2 ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కానుంది.

ఈనెల 30వ తేదీ (రేపు), ఎఫ్2 ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వేదికైంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి, ఎఫ్2 ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కానుంది.
విక్టరీ వెంకటేష్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీబ్యూటీ తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఎఫ్2. ఫన్ అండ్ ఫస్ట్రేషన్… ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కీ, టీజర్ అండ్ రెచ్చిపోదాం బ్రదర్, ఎంతో ఫన్ పాటలకీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 30వ తేదీ (రేపు), ఎఫ్2 ఆడియో రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఫంక్షన్‌కి వైజాగ్‌లోని ఆర్కే బీచ్ వేదికైంది. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి, ఎఫ్2 ఆడియో ఫంక్షన్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.
ఆడియో లాంచ్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో, వెంకీ, వరుణ్‌లిద్దరూ మైక్ ముందు రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు. ఈ మూవీలో వెంకీ, వరుణ్‌లు తోడల్లుళ్ళుగా కనిపించబోతుండగా, వారికి జంటగా, అక్కా, చెళ్ళెల్లుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ వంటి హ్యాట్రిక్ హిట్స్‌తో జోష్ మీదున్న అనిల్ రావిపూడి, ఎఫ్2 తో సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేస్తాననే ధీమాతో ఉన్నాడు.
ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఎఫ్2, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్న కార్యక్రమాలు జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా2019 జనవరి 12న మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి కెమెరా : సమీర్ రెడ్డి, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : తమ్మిరాజు
వాచ్ టీజర్…