ఆంధ్రోడా.. మీ తాట తీయనీకి వస్తున్నా!

  • Published By: vamsi ,Published On : April 20, 2019 / 06:14 AM IST
ఆంధ్రోడా.. మీ తాట తీయనీకి వస్తున్నా!

Updated On : April 20, 2019 / 6:14 AM IST

కాంట్రవర్శీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాతో వచ్చిన వర్మ.. తెలంగాణ రాష్ట్ర సాధన నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జీవితం ఆధారంగా టైగర్ కేసిఆర్ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలోనే తాజాగా కేసిఆర్ బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ.

అంతేకాదు వర్మ స్వయంగా సినిమాకు సంబంధించిన పాటను ఆలపిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. భాష మీద నవ్వినవ్.. ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిచినవ్.. వస్తున్నా.. ఆంధ్రోడా నీ తాట తీయనీకి వస్తున్నా… అంటూ వర్మ పాట పాడారు.

వర్మ విడుదల చేసిన పాటలో అనేక వివాదాస్పద మాటలు ఉండగా.. సినిమాలో ఎవరెవరి పాత్రలు ఉండబోతున్నాయనే విషయాన్ని వెల్లడించారు. కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా ఉన్న సమయంలో  రాష్ట్రరాజకీయాల్లోని కీలక వ్యక్తులంతా ఈ బయోపిక్‌లో కనిపించనున్నారు.

కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌, కూతురు కవిత, అల్లుడు హరీష్‌ రావు, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. చంద్రబాబు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌ రెడ్డి, రామోజీ రావులతో పాటు నారా లోకేష్ పాత్ర కూడా సినిమాలో ఉంటుందని వర్మ ప్రకటించాడు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ విభజన తరువాత ప్రశాంతంగా కలసి మెలసి జీవిస్తున్న తెలంగాణ ఆంధ్ర వాళ్ళ మధ్య వర్మ చిచ్చు పెడుతున్నారు. అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ఆ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ.. ఇది ఆంధ్రావాళ్లను విలన్లుగా చూపించేందుకు తీస్తున్న సినిమా కాదు అని అన్నారు.