Acharya Release Postponed : కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : ‘ఆచార్య’ విడుదల వాయిదా
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య విడుదల వాయిదా వేశారు. మే 13న విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.

Acharya Movie
Acharya Cinema Release Postponed : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆచార్య విడుదల వాయిదా వేశారు. మే 13న విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
‘ఖైదీ నెం:150’, ‘సైరా’ తర్వాత సొంత ప్రొడక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’.. శ్రీమతి సురేఖ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
‘ఆచార్య’ సిినిమాను వేసవి కానుకగా మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.