Daggubati Rana : భూవివాదంలో.. సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదు..

తాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. అలాగే సురేష్ బాబు, రానాపై......................

Daggubati Rana : భూవివాదంలో.. సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదు..

Criminal case files on Daggubati Rana and suresh babu in a land issue

Updated On : February 11, 2023 / 10:01 AM IST

Daggubati Rana :  గత కొంతకాలంగా నిర్మాత సురేష్ బాబు, హీరో రానాకి చెందిన ఓ భూమికి సంబంధించి వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఫిలింనగర్ లో సురేష్ బాబుకి ఉన్న ఓ స్థలాన్ని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికి లీజుకి ఇచ్చారు. ప్రతి రెండేళ్ళకి ఆ లీజు రెన్యూవల్ చేయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఇంకా ఆ స్థలం లీజులో ఉండగానే అందులోని కొంతభాగాన్ని రానా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, ఆ వ్యాపారిని ఖాళీ చేయమని ఒత్తిడి చేయడంతో ఆ వ్యాపారి అప్పుడే పోలీసులకి ఫిర్యాదు చేశాడు, కోర్టుకి వెళ్ళాడు.

తాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. అలాగే సురేష్ బాబు, రానాపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే కోర్టుని ఆశ్రయించానని తెలిపాడు.

Aamir Khan : అమీర్ ఖాన్ కాలికి ఏమైంది? ఎందుకు స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడు? ఆందోళనలో అభిమానులు..

బాధితుడు కోర్టుని ఆశ్రయించడంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో పాటు మరి కొంతమందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులు పంపించింది నాంపల్లి కోర్టు. ఇప్పటివరకు దీనిపై రానా, సురేష్ బాబు ఎవరూ స్పందించలేదు. మరి ఆ వ్యాపారి చేసే ఆరోపణలపై రానా, సురేష్ బాబు స్పందిస్తారేమో చూడాలి.