Custody Movie : 20 రోజులు నీళ్ళల్లోనే షూట్.. కస్టడీ సినిమాలో అదే హైలెట్..

ఇటీవలే అఖిల్ ఏజెంట్ తో ఫ్లాప్ మూట కట్టుకోవడంతో నాగ చైతన్య కస్టడీతో ఎలాగైనా హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు. కృతిశెట్టి కూడా ఫ్లాప్స్ లో ఉండటంతో ఆమెకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.

Custody Movie : 20 రోజులు నీళ్ళల్లోనే షూట్.. కస్టడీ సినిమాలో అదే హైలెట్..

Custody Movie highlight points said by producer

Updated On : May 11, 2023 / 8:48 AM IST

Custody Movie :  నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ(Custody) సినిమా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ గత కొద్ది రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నిర్మాత చిట్టూరి శ్రీనివాస రావు ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నిర్మాత చిట్టూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. 1990ల్లో జరిగే కథ ఇది. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో ఈ సినిమా చేయాలనుకున్నాం. ప్రతి షాట్ ని రెండు భాషల్లో తీశాం. నిజాయితీ గల ఓ పోలీస్ కానిస్టేబుల్ కథ ఇది. యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్, కామెడీ కూడా ఉంటుంది. సినిమాలో నాలుగు మెయిన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అవి ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. ఈ సినిమాలో ఉన్న నీళ్ళల్లో సాగే సన్నివేశాలు తెలుగులో ఇప్పటివరకు రాలేదు. ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ సన్నివేశాల్ని మైసూర్, రాజమండ్రిలో షూట్ చేశాం. రోజుకు రెండు షిఫ్టులుగా దాదాపు 20 రోజులు కష్టపడి ఆ సీన్స్ ని తెరకెక్కించాం. సినిమాకు ఆ సీన్స్ చాలా ప్లస్ అవ్వనున్నాయి అని తెలిపారు.

Producer Srinivasaa : అప్పుడు సమంతకు.. ఇప్పుడు నాగ చైతన్యకు కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాలు ఇచ్చాం..