Tollywood : కార్మికుల వేతనాలు పెంచుతూ.. ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి నిర్ణయం..
ఇక ఇటీవల సినీ సమస్యలని చర్చించడానికి అనేక కమిటీలు వేసి వాటికి తగ్గ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల వేతనాలని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా...................

Daily wages of Tollywood film workers increased
Tollywood : ఇటీవల సినీ కార్మికుల వేతనాలు పెంచాలని కార్మికులు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. సాధారణంగా కార్మికుల ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఒప్పందం ప్రకారం ప్రతి మూడేళ్లకు కార్మికుల వేతనాలని పెంచాలి. 2019 లోనే వేతనాలని పెంచాల్సి ఉన్నా కరోనా కారణంగా గత రెండేళ్లుగా వేతనాలని పెంచలేదు. తమ వేతనాలని పెంచాలంటూ ఇటీవల సినీ కార్మికులు సమ్మె చేయగా పెంచుతామని నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రకటించింది.
ఇక ఇటీవల సినీ సమస్యలని చర్చించడానికి అనేక కమిటీలు వేసి వాటికి తగ్గ నిర్ణయాలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల వేతనాలని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.
కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 15 నుంచి 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ సంయుక్తంగా ప్రకటించారు. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏది పెద్ద సినిమా, ఏది చిన్న సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని తెలిపారు. ఈ కొత్త వేతనాల పెంపు 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మాతల మండలి తెలిపింది. దీంతో సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp
— Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022