నాలుగు భాషల్లో ‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్

‘ద‌ర్బార్‌’ మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు బాష‌ల్లో నలుగురు స్టార్స్ రిలీజ్ చేయనున్నారు..

  • Published By: sekhar ,Published On : November 7, 2019 / 05:02 AM IST
నాలుగు భాషల్లో ‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్

Updated On : November 7, 2019 / 5:02 AM IST

‘ద‌ర్బార్‌’ మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు బాష‌ల్లో నలుగురు స్టార్స్ రిలీజ్ చేయనున్నారు..

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ద‌ర్బార్‌’.. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుపుకుంటుంది. కాగా ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ‘ద‌ర్బార్‌’ మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు బాష‌ల్లో విడుద‌ల చేయనున్నారు.

మోష‌న్ పోస్ట‌ర్ నాలుగు భాష‌ల్లో విడుద‌ల‌వుతుందంటే.. సినిమా కూడా నాలుగు భాష‌ల్లో విడుద‌లవుతుంద‌ని అర్థం. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ‘ద‌ర్బార్’ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. త‌మిళ్ పోస్టర్‌ను ‘విశ్వనాయకుడు’ క‌మ‌ల్ హాస‌న్ గురువారం సాయంత్రం విడుద‌ల చేయనున్నారు..

Read Also : నా లవ్ విజయ్ మాల్యా లాంటిది.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం!

హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను సల్మాన్‌ఖాన్‌.. మ‌ల‌యాళ మోష‌న్ పోస్ట‌ర్‌ను ‘కంప్లీట్ యాక్టర్’ మోహ‌న్‌లాల్, తెలుగు మోషన్ పోస్టర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు విడుద‌ల చేయనున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా 2020 జ‌న‌వ‌రి 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.