David Warner : హైదరాబాద్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్.. ఆదివారం యమా బిజీ.. ఓవైపు ఐపీఎల్, మరో వైపు ప్రీరిలీజ్ ఈవెంట్..
డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

David Warner landed in Hyderabad for the Robinhood Pre Release Event today
ఓ వైపు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. నేడు (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.
డేవిడ్ వార్నర్.. తెలుగు వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొన్ని సీజన్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. వార్నర్ నాయకత్వంలోనే 2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇక లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమా పాటలు, డైలాగ్‌లను రీల్స్ చూస్తూ అందరిని అలరించాడు.
CSK vs MI : ముంబైతో మ్యాచ్.. అరుదైన రికార్డు పై ధోని కన్ను.. చరిత్ర సృష్టించేనా?
కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన వార్నర్ కేవలం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగుల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ఐపీఎల్ మెగా వేలం 2025లో వార్నర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్ 2025లో అతడు ఆడడం లేదు.
ఐపీఎల్ ద్వారా కాకుంటేనేం.. సినిమా ద్వారా అలరించేందుకు వార్నర్ సిద్ధం అయ్యాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో వార్నర్ అడుగుపెట్టాడు. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
CSK vs MI : చెన్నైతో మ్యాచ్.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందుకోనున్న రికార్డు ఇదే..
ఈనేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని HICC నోవాటెల్ లో సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వెంట్‌లో హాజరు అయ్యేందుకు వార్నర్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.
కాగా.. ఈ ఈవెంట్‌లో పాల్గొనేకంటే ముందుగానే ఐపీఎల్ లో వార్నర్ సందడి చేయనున్నాడు. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీలతో కలిసి వార్నర్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మ్యాచ్‌కు సంబంధించిన విషయాలతో పాటు సినిమా ప్రమోషన్స్‌ను వార్నర్ ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.