Deepika Padukone: నీ డ్రెస్ రణ్వీర్ డిజైన్ చేశాడా.. దీపికాపై నెటిజన్ల ట్రోలింగ్

సెలబ్రిటీలు బయట వేడుకలకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే డ్రెస్సింగ్ నుండి అవుట్ లుక్ వరకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదంటే నెటిజన్ల..

Deepika Padukone: నీ డ్రెస్ రణ్వీర్ డిజైన్ చేశాడా.. దీపికాపై నెటిజన్ల ట్రోలింగ్

Deepika Padukone

Updated On : March 6, 2022 / 1:25 PM IST

Deepika Padukone: సెలబ్రిటీలు బయట వేడుకలకు వెళ్లేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీలైతే డ్రెస్సింగ్ నుండి అవుట్ లుక్ వరకు అన్నీ చూసుకొని వెళ్ళాలి. లేదంటే నెటిజన్ల చేతిలో బలి కావాల్సిందే. లక్షలు పోసి కొన్న డిజైనర్ వేర్ అయిన సరే.. అది వాళ్ళకి సూటు కాకపోతే నెటిజన్లు ఎడాపెడా ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే అలా మలైకా అరోరా నుండి కాజోల్, ప్రియాంకా, కంగనా ఇలా చాలామంది ట్రోల్స్ బారిన పడ్డవారే. దీపికా పడుకొనే కూడా ఈ మధ్య నెటిజన్ల నుండి ఘోరంగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.

Deepika Padukone: మల్టీ టాస్కింగ్ దీపికా.. ఏ అవకాశాన్నీ వదలుకొనేదేలేదు!

దీపికా తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఓ టైట్ రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో కనిపించిన దీపికా.. క్యాప్‌, హ్యాండ్‌బ్యాగ్‌ కూడా ఎరుపు రంగులోనే ఉండగా చివరికి హై హీల్స్‌ కూడా రెడ్‌ కలర్‌లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. దీపికా భర్త రణ్వీర్ కూడా ఇలానే చూడగానే భయపడేలా డ్రెస్ వేస్తున్నాడని పేరుంది. అలాగే దీపికా కోసం ఈ డ్రెస్ కూడా రణ్వీర్ డిజైన్ చేసాడేమో అని నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

అంతేకాదు.. జొమాటో డెలివరీ బాయ్స్ కూడా ఒక్క షర్ట్ మాత్రమే వాడతారని.. కానీ దీపికా మాత్రం టాప్ టూ బాటమ్ అన్నీ రెడ్ కలర్ లోనే చిన్న పిల్లలకి చలి జ్వరం వచ్చేలా ఉందంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్న కామెంట్ చేస్తున్న నెటిజన్లు.. ఇప్పటికైనా రణ్వీర్ మాట వినకుండా నీకు వచ్చినట్లు డ్రెస్ చేసుకో దీపికా ప్లీజ్ అంటూ బ్రతిమాలుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)