Dhanush Aishwaryaa : షాకింగ్.. రజనీ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడాకులు

చిత్ర పరిశ్రమకు చెందిన మ‌రో ప్ర‌ముఖ సినీ జంట విడిపోయింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Dhanush Aishwaryaa : షాకింగ్.. రజనీ కూతురు ఐశ్వర్య, ధనుష్ విడాకులు

Dhanush Aishwaryaa

Updated On : January 18, 2022 / 6:59 AM IST

Dhanush Aishwaryaa : చిత్ర పరిశ్రమకు చెందిన మ‌రో ప్ర‌ముఖ సినీ జంట విడిపోయింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, తమిళ స్టార్ హీరో ధనుష్ విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాము విడిపోతున్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా స్వయంగా ధనుష్ వెల్ల‌డించాడు. దాదాపు 18ఏళ్లు కలిసున్న ఐశ్వర్య-ధనుష్ జంట విడిపోవ‌డం అంద‌రినీ షాక్ కి గురిచేస్తోంది.

రజనీకాంత్ పెద్ద కూతురే ఐశ్వర్య. ధనుష్-ఐశ్వర్య 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ధనుష్ ప్రకటించాడు.

Naga Chaitanya : నాగ చైతన్య స్టైలిష్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?

‘మేం 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్నాము. స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా.. ఇలా ఎన్నో రకాలుగా కలిసి జీవించాం. కానీ ఈరోజు విడిపోయే చోట నిలబడ్డాం. ఐశ్వర్య, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ప్రైవసీని మాకు అందించండి. ఓం నమశివాయ! ప్రేమతో మీ ధనుష్’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ధనుష్.

NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30

కాగా, ఇటీవలే ప్రముఖ సినీ జంట నాగచైతన్య, సమంత విడిపోయారు. విడిపోతున్నట్టు వీరిద్దరూ చేసిన ప్రకటన సినీ పరిశ్రమలో సంచలనమైంది. లవ్లీ కపుల్ గా గుర్తింపు పొందిన వీరి జోడీ విడిపోవడం అభిమానులను తీవ్రంగా బాధించింది.