Dhanush – Pawan Kalyan : మరోసారి ధనుష్ క్లారిటీ.. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలి అంటూ..
ధనుష్ రైటర్, డైరెక్టర్, సింగర్ కూడా కావడంతో..

Dhanush Wants to Direct Pawan Kalyan in Telugu
Dhanush – Pawan Kalyan : తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనుష్ – నాగార్జునతో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ లో యాంకర్ సుమ మూవీ యూనిట్ అందర్నీ సరదా ప్రశ్నలు అడగగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ధనుష్ రైటర్, డైరెక్టర్, సింగర్ కూడా కావడంతో మీరు డైరెక్షన్ కూడా చేస్తారు కదా. తమిళ్ లో చేశారు, తెలుగులో డైరెక్షన్ చేస్తే ఎవరితో చేస్తారు అని అడిగారు.
దీనికి ధనుష్ సమాధానమిస్తూ.. పవన్ కళ్యాణ్ సర్ ని డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నా అని తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ధనుష్ ఇదే చెప్పాడు. మరి ధనుష్ – పవన్ కళ్యాణ్ సినిమా భవిష్యత్తులో పాజిబుల్ అవుతుందా లేదా చూడాలి. ఈ కాంబో సెట్ అయితే మాత్రం పాన్ ఇండియా దద్దరిల్లిపోవాల్సిందే. పవన్ కళ్యాణ్ అంటే ధనుష్ కి ఇష్టం అని, ఆయన సినిమాలు, బయట రియల్ లైఫ్, పాలిటిక్స్ లో కూడా ఇష్టం అని గతంలో తెలిపారు ధనుష్.
Also See : Anasuya Bharadwaj : భర్తతో అనసూయ క్యూట్ ఫొటోలు.. సండే సరదాగా..