Dancer Pandu: ‘ఢీ’ జోడి డాన్సర్ పండుకు ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కాళ్లకు తీవ్ర గాయాలు
'ఢీ' జోడి డాన్సర్ పండు(Dancer Pandu)కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అతని రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Dhee jodi dancer pandu wet with an accident
Dancer Pandu: విశాఖ జిల్లా ఆనందపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ జోడి ఫేమ్ పండు(Dancer Pandu) (సూర్యప్రకాష్) తీవ్రంగా గాయపడ్డారు. తగరపువలసలో అమ్మవారి పండుగ ఈవెంట్ ముగించుకుని కార్లో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో తోటి డ్యాన్సర్‌కు వాంతులు అవ్వడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు.
Kriti Sanon: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆదిపురుష్ హీరోయిన్.. కృతి సనన్ డివోషనల్ ఫొటోస్ వైరల్
ఆ సమయంలో పండు కారు వెనుక భాగంలో నిలబడగా, వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక బొలేరో వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
