Charmme Kaur : వామ్మో ఛార్మీ పెంపుడు కుక్కని చూశారా? ఎంత పెద్దగా ఉందో.. ఏ బ్రీడ్ అంటే..
నటి, నిర్మాత ఛార్మీ కౌర్ పెంపుడు కుక్క కూడా వైరల్ అవుతుంది.

Did you See Charmme Kaur Pet Dog Photos goes Viral
Charmme Kaur : ఇప్పుడు అందరి ఇళ్లల్లో పెంపుడు కుక్కలు, పెంపుడు పిల్లులు.. ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీల దగ్గర అయితే చెప్పనవసరం లేదు. పెంపుడు కుక్కలు తమ ఫ్యామిలీలో భాగం అన్నట్టే చూస్తారు. అనేకమంది నటీనటులు, స్టార్స్ తమ పెంపుడు జంతువులతో ఫోటోలు షేర్ చేసారు. రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్, విజయ్ దేవరకొండ పెంపుడు కుక్క స్టార్మ్.. ఇలా పలువురు స్టార్స్ పెంపుడు జంతువులు కూడా పాపులర్ అయ్యాయి.
Also Read : Devara Update : ‘దేవర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలుపెట్టేసిన నటి.. షూటింగ్ అయిపోయిందా?
నటి, నిర్మాత ఛార్మీ కౌర్ పెంపుడు కుక్క కూడా వైరల్ అవుతుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన ఛార్మి ప్రస్తుతం నటిగా బ్రేక్ తీసుకొని పూరి జగన్నాధ్ తో కలిసి నిర్మాతగా సినిమాలు చేస్తుంది. ఛార్మి ఇప్పటికే పలుమార్లు తన పెంపుడు కుక్క ఫోటోలు షేర్ చేసింది. తాజాగా ఛార్మి మరోసారి తన పెంపుడు కుక్క ఫోటోలు షేర్ చేసింది.
ఛార్మి పెంపుడు కుక్కని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇంత పెద్దగా ఉంది.. ఇది కుక్కా లేక సింహమా? మనిషి అంత హైట్ ఉందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది అలస్కాన్ మలమ్యూట్(Alaskan Malamute) అనే బ్రీడ్ కి చెందిన కుక్క. ఈ బ్రీడ్ కి చెందిన కుక్కలు చిన్నప్పటి నుంచే పెద్దగా ఉంటాయి. పెరిగే కొద్దీ మరింత పెద్దగా అవుతాయి. ఈ కుక్క దాదాపు నాలుగేళ్లుగా ఛార్మి దగ్గరే ఉంది. ప్రస్తుతం ఛార్మి, ఆమె పెంపుడు కుక్క ఫోటోలు వైరల్ గా మారాయి. ఛార్మి దగ్గర ఈ పెద్ద కుక్క కాకుండా ఇంకో చిన్న కుక్క పిల్ల కూడా ఉంది.