Dil Raju : RRR టీంకు దిల్ రాజు సంస్థ స్పెషల్ గిఫ్ట్స్..

దిల్ రాజు నిర్మాణ సంస్థ తరపున RRR టీం కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. వరల్డ్ గ్లోబ్, నాటు నాటు స్టెప్ ఫోటో, క్లాప్, సినిమా రీల్.. ఇలా సినిమాకు సంబంధించినవి అన్ని ఉండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. ఈ గిఫ్ట్స్ ని నిర్మాత దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్డి, హర్షిత్ లు స్వయంగా వెళ్లి..................

Dil Raju : RRR టీంకు దిల్ రాజు సంస్థ స్పెషల్ గిఫ్ట్స్..

Dil Raju gifted special gifts to RRR team and appreciated for Oscar Winning

Updated On : March 23, 2023 / 10:38 AM IST

Dil Raju :  RRR నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించి ప్రపంచ సినీ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో దేశమంతా గర్వపడేలా చేసారు RRR టీం. ఆస్కారం అవార్డు అందుకున్న మరుక్షణం నుంచి RRR చిత్ర యూనిట్ పై అభినందనలు కురుస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడికి తిరిగి వచ్చాక పలువురు RRR టీంలోని మెంబర్స్ ని ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. కొంతమంది వారిని సన్మానించి వారికి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు.

Rashmika Mandanna : అప్పుడు వచ్చిన విమర్శలని గుర్తుపెట్టుకొని నిజం చెప్పిన రష్మిక.. రష్మిక వర్సెస్ రిషబ్ శెట్టి.. కథ సమాప్తం?

 

ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణ సంస్థ తరపున RRR టీం కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. వరల్డ్ గ్లోబ్, నాటు నాటు స్టెప్ ఫోటో, క్లాప్, సినిమా రీల్.. ఇలా సినిమాకు సంబంధించినవి అన్ని ఉండేలా ఓ స్పెషల్ గిఫ్ట్ చేయించారు. ఈ గిఫ్ట్స్ ని నిర్మాత దిల్ రాజు, శిరీష్, హన్షిత రెడ్డి, హర్షిత్ లు స్వయంగా వెళ్లి రాజమౌళి, కీరవాణి, ప్రేమ్ రక్షిత్, ఎన్టీఆర్, చరణ్, నిర్మాత దానయ్యలకు అందించారు. వారికి స్పెషల్ గా అభినందిస్తూ లేఖలను కూడా రాసి ఈ గిఫ్ట్ లో పొందు పరిచారు. ఆ లేఖలు, వీరు గిఫ్ట్స్ ఇచ్చిన ఫోటోలని వీడియో రూపంలో తమ నిర్మాణ సంస్థ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చరణ్ కి RC 15 సెట్ కి వెళ్లి ఈ గిఫ్ట్ ని అందించగా, మిగిలిన వాళ్లందరికీ వారి ఇంటికి వెళ్లి మరీ ఈ గిఫ్ట్స్ ని అందించారు దిల్ రాజు నిర్మాణ సంస్థ. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలా RRR టీంని స్పెషల్ గిఫ్ట్స్ తో అభినందించడంతో అభిమానులు, నెటిజన్లు దిల్ రాజుని అభినందిస్తున్నారు.