Telugu Film Producer Council Elections : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ రిజల్ట్.. దిల్ రాజు వర్గం గెలుపు.. ఫిల్మ్ ఛాంబర్ దగ్గర సెలెబ్రేషన్స్!
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ దిల్ రాజు మద్దతు తెలిపిన వర్గం గెలుపు సాధించడంతో.. ఫిల్మ్ ఛాంబర్ టపాసులు కలుస్తూ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు దిల్ రాజు వర్గం.

dil raju pannel members are celebrating at film chamber their win
Telugu Film Producer Council Elections : తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ విషయం గురించి గత కొంత కాలంగా టాలీవుడ్ లో పెద్ద రచ్చే జరుగుతుంది. నిర్మాతల మండలి ఎన్నికలు ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరగాలి. కానీ కరోనా కారణంగా ఈ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయి. కరోనా తగ్గి, సినిమా పనులు ఎప్పటి లాగానే మొదలైనా నిర్మాత మండలి ఎన్నికల పెట్టకపోవడంతో.. ఇటీవల చిన్న నిర్మాతల పెద్ద గొడవే చేశారు. ఇక దీనికి స్పందిస్తూ నిర్మాత సి కళ్యాణ్ ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి.
ఇక ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దిల్ రాజు మద్దతుతో దామోదర ప్రసాద్ వర్గం, సి కళ్యాణ్ మద్దతుతో జెమిని కిరణ్ వర్గం ఎన్నికలకు వచ్చాయి. ఇక ఈరోజు ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. నిర్మాతల మండలిలో మొత్తం 1134 ఓటర్స్ ఉండగా, పోలైన ఓట్లు కేవలం 678 మాత్రమే. ఈ ఎన్నికలు కౌంటింగ్ 4 గంటలకు మొదలు కాగా.. తాజాగా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు.
ఈ పోరులో ప్రెసిడెంట్ పదవికి దామోదర ప్రసాద్, జెమిని కిరణ్ పోటీ చేయగా.. జెమిని కిరణ్ కి 315 ఓట్లు పడగా, దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రావడంతో, 24 ఓట్లు తేడాతో దామోదర ప్రసాద్ గెలుపు సాధించాడు. అలాగే ఉపాధ్యక్ష పదవికి సుప్రియ అశోక్, ట్రెజరర్ పదవికి తుమ్మలపల్లి రామ సత్యన్నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక హనరబుల్ సెక్రెటరీ పోస్ట్ ప్రసన్న కుమార్, yvs చౌదరి బరిలో నిలవగా.. ప్రసన్న కుమార్ 16 ఓట్ల తేడాతో గెలుపొందాడు.
జాయింట్ సెక్రెటరీగా నట్టి కుమార్ పై భారత్ చౌదరి 165 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సాధించాడు. ఇక ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ గా దిల్ రాజు, దానయ్య, రవి కిషోర్, యలమంచిలి రవి, పద్మిని, బెక్కం వేణుగోపాల్, సురేందర్ రెడ్డి, గోపీనాథ్ ఆచంట, మధుసూదన్ రెడ్డి, కేశవరావు, శ్రీనివాద్ వజ్జ, అభిషేక్ అగర్వాల్, కృష్ణ తోట, రామకృష్ణ గౌడ్, కిషోర్ పూసలు ఎన్నికయ్యారు. దిల్ రాజు మద్దతు తెలిపిన వర్గం గెలుపు సాధించడంతో.. ఫిల్మ్ ఛాంబర్ టపాసులు కలుస్తూ సెలెబ్రేషన్స్ జరుపుకుంటున్నారు దిల్ రాజు వర్గం.