Biopic Movies: డైరెక్షన్ లోపం.. స్టార్లతో సినిమా అంటే మజాకా?
స్టార్ హీరోలతో సినిమా అంటే అభిమానులలో ఒక అంచనా ఉంటుంది. అది దర్శకుడు దృష్టిలో పెట్టుకొని హీరోను డీల్ చేయాలి. లేదంటే సక్సెస్ ఎలా ఉన్నా అభిమానుల నుండి డిజాస్టర్ ఫలితాన్ని చూడాల్సి..

Biopic Movies
Biopic Movies: స్టార్ హీరోలతో సినిమా అంటే అభిమానులలో ఒక అంచనా ఉంటుంది. అది దర్శకుడు దృష్టిలో పెట్టుకొని హీరోను డీల్ చేయాలి. లేదంటే సక్సెస్ ఎలా ఉన్నా అభిమానుల నుండి డిజాస్టర్ ఫలితాన్ని చూడాల్సి వస్తుంది. ఎంత కాదన్నా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో. ఈ స్టార్ హీరో సినిమాలో ఏ చిన్న తప్పు చేసినా సినిమా ఫ్లాప్ ఫేస్ చెయ్యాల్సి ఉంటుంది. ఇలాంటి మిస్టేక్స్ చేసి చిరంజీవితో పెద్ద సినిమాని హ్యాండిల్ చెయ్యలేకపోయారు సురేందర్ రెడ్డి.
Mithali Raj biopic: మిథాలీ బయోపిక్‌లో తాప్సీ.. లిరిక్స్ లీక్
అమితాబ్, విజయ్ సేతుపతి, సముద్రఖని నయనతార, తమన్నా లాంటి స్టార్ కాస్ట్ తో భారీ యాక్షన్ సీన్స్ తో పోరాట యోధుడి జీవితకథగా సైరా నర్సింహారెడ్డి సినిమా తియ్యడంలో అంతగా సక్సెస్ కాలేకపోయారు సురేందర్ రెడ్డి. అప్పటి వరకూ యంగ్ హీరోలతో సినిమాలు చేసి ఒకటే సారి అనుష్క, రానా, అల్లు అర్జున్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో సినిమా చేసి ఫ్లాప్ ఫేస్ చేశారు గుణ శేఖర్. బాహుబలి ఫీవర్ ఇంకా తగ్గకముందే రుద్రమదేవి సినిమా చేసిన గుణ శేఖర్.. ఈ రేంజ్ భారీ హిస్టారికల్ మూవీని హ్యాండిల్ చెయ్యలేక సరైన హిట్ కొట్టలేకపోయారు.
PV Sindhu Biopic: దీపికా మరో క్రేజీ ఫిల్మ్.. సిల్వర్ స్క్రీన్ మీద సింధు సక్సెస్ స్టోరీ!
బాలకృష్ణ సినిమాల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కించిన మూవీ కథానాయకుడు. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలకృష్ణ లీడ్ రోల్ లో డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాతో బాలయ్య బాబుని కొత్తగా చూపించే ఛాన్స్ దక్కించుకున్నారు క్రిష్. రెండు పార్టులుగా ఉన్న ఈ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ కథానాయకుడిగా, మహానాయకుడిగా రిలీజ్ అయ్యింది. అయితే ఎక్స్ పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉండటంతో పాటు సినిమా ఆడియన్స్ కి ఎక్కడా కనెక్ట్ కాకపోవడంతో సినిమా ఫ్లాప్ అయ్యింది. క్రిష్ డైరెక్షన్ లోపం క్లియర్ గా ఉండడంతో పాటు.. ఎమోషనల్ యాస్పెక్ట్స్ లేకుండా జస్ట్ గెటప్స్ మీద కాన్ సన్ ట్రేట్ చెయ్యడంతో అస్సలు జనాలు యాక్సెప్ట్ చెయ్యలేదు.
Dasari Biopic: దాసరి బయోపిక్.. దర్శకరత్న పేరిట నేషనల్ అవార్డ్స్!
బయోపిక్స్ అంటే ఒళ్లు దగ్గరపెట్టుకుని సినిమాలు చెయ్యాల్సి ఉంటుంది. అదీ పొలిటికల్ పర్సన్ బయోపిక్ అయితే.. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఆడియన్స్ తో పాటు పార్టీ వాళ్లు కూడా ఉతికి ఆరేస్తారు. తమిళ సినీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన జయలలిత బయోపిక్ తెరకెక్కించారు డైరెక్టర్ ఎల్. విజయ్. అప్పటి వరకూ విజయ్ చేసిన సినిమాలు వేరు.. తలైవి బయోపిక్ వేరు. చాలా కాన్ఫిడెంట్ గా తీస్తున్నానని విజయ్ అనుకున్నా.. అసలు కంగనాని జయలలిత క్యారెక్టర్ కి సెలక్ట్ చేసిన దగ్గరే ఇంప్రెషన్ పోగొట్టుకున్నాడు విజయ్. 3 గంటల్లో జయలలిత సినీ, రాజకీయ జీవితాన్ని సరిగా చూపించలేక మిస్ ఫైర్ అయ్యారు విజయ్.