Maruthi: రాజాసాబ్ ప్లాప్.. మెగా హీరోతో మూవీ సెట్.. మారుతీ సూపర్ ప్లాన్

ది రాజాసాబ్ సినిమా ప్లాప్ తరువాత మెగా హీరోతో సినిమా సెట్ చేసుకున్న దర్శకుడు మారుతీ(Maruthi).

Maruthi: రాజాసాబ్ ప్లాప్.. మెగా హీరోతో మూవీ సెట్.. మారుతీ సూపర్ ప్లాన్

director maruthi doing his next movie with varun tej

Updated On : January 22, 2026 / 6:53 AM IST
  • రాజాసాబ్ తరువాత మారుతీ కొత్త సినిమా
  • మెగా హీరోని సెట్ చేసిన దర్శకుడు
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Maruthi: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు మారుతీ. కామెడీ చిత్రాలు, చిన్న చిన్న సినిమాలు చేసుకునే ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేసిన సినిమా ది రాజాసాబ్. హారర్ అండ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో పాజిటీవ్ గా లేకపోవడం గమనార్హం.

దీంతో, ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ విషయంలో దర్శకుడు మారుతిపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో, మారుతీ(Maruthi) చేయబోతే నెక్స్ట్ సినిమాపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే మారుతీ తన నెక్స్ట్ సినిమాను మెగా హీరోతో చేయాలనీ ఫిక్స్ అయ్యాడట. అయితే, అందరు మెగాస్టార్ చిరంజీవితో మారుతీ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు అని అనుకున్నారు.

Kalyani Priyadarshan: బ్లాక్ డ్రెస్సులో కేకపెట్టిస్తున్న కళ్యాణి.. హాట్ ఫొటోలు

కానీ, చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి, మెగాస్టార్ తో కాకుండా మరో మెగా హీరోతో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. ఆ మెగా హీరో మీరెవరో కాదు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ను ఈమధ్యే కలిసిన మారుతీ ఆయనకు కథను కూడా వినిపించాడట. పూర్తి మారుతీ స్టయిల్లో పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా ఉండటంతో వరుణ్ తేజ్ వెంటనే ఒకే చెప్పేశాడట.

మారుతీ చేసిన భలే భలే మొగాడివోయ్ తరహాలో పక్కా ఎంటర్టైన్ గా ఈ సినిమా రానుందట. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజు అనే అనే ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల అయిన వెంటనే మారుతీ సినిమా మొదలవుతుందని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా మారుతీ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.