Rohit Damodaran : డైరెక్టర్ శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు

స్టార్ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు..

Rohit Damodaran : డైరెక్టర్ శంకర్ అల్లుడిపై లైంగిక వేధింపుల కేసు

Director Shankar Son In Law

Updated On : October 21, 2021 / 2:41 PM IST

Rohit Damodaran: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ అల్లుడు, క్రికెటర్ రోహిత్ దామోదరన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. 16 సంవత్సరాల బాలికను లైంగింకంగా వేధించినందుకు గాను పోక్సో చట్టం కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు.

Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్ కోచింగ్ కోసం వెళ్లిన 16 సంవత్సరాల మైనర్‌ను, రోహిత్, అతని తండ్రి, క్రికెట్ క్లబ్ కార్యదర్శితో పాటు మరో ఇద్దరు లైంగింకంగా వేధించారని అక్టోబర్ 19న పుదుచ్చేరిలోని మెట్టుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.

RC 15 : పోస్టర్ అంత కాస్టా.. శంకర్ సినిమా అంటే అంతే మరి..!

దీంతో పోలీసులు రోహిత్, అతని తండ్రితో పాటు మిగతా వారి మీద కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించారని.. తనను ఏ విధంగా వేధింపులకు గురి చేసారనే విషయాలు వెల్లడిస్తూ బాధితురాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మరో లేఖ వ్రాసింది. ఈ ఏడాది జూన్‌లో శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్‌తో రోహిత్ వివాహం జరిగింది.

Director Shankar