పురాతన ఆలయంతోపాటు అభయారణ్యాన్ని సందర్శంచిన రాజమౌళి దంపతులు..

  • Published By: sekhar ,Published On : September 18, 2020 / 01:17 PM IST
పురాతన ఆలయంతోపాటు అభయారణ్యాన్ని సందర్శంచిన రాజమౌళి దంపతులు..

Updated On : September 18, 2020 / 2:26 PM IST

Rajamouli Couple Visits Himavad Gopalaswamy Hill: దర్శకధీరుడు రాజమౌళి సతీసమేతంగా కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని పురాతన హిమవద్ గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు రాజమౌళి దంపతులకు వేదమంత్రాలతో సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన రాజమౌళి దంపతులు మొక్కు తీర్చుకోవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని బండీపూర్ అభయారణ్యంలో భార్యతో కలిసి విహరించిన రాజమౌళి.. అభయారణ్యం పరిసరాల్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో బస చేసినట్లు సమాచారం.


కాగా హిమవద్ గోపాలస్వామి టెంపుల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బండీపూర్ అభయారణ్యంలో పులి సంరక్షణ ప్రాంతాన్ని చేరుకున్నారట. రాజమౌళి దంపతులు జీపులో అభయారణ్యంలో కలియదిరుగుతూ అటవీ సిబ్బంది ద్వారా అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ త్వరలో పున:ప్రారంభం కానుంది.