స్టార్ హీరో అభిమానులపై కేసు పెట్టిన తరుణ్ భాస్కర్

సోషల్ మీడియా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు స్వతంత్రంగా భావాలను పంచుకునే వేదికగా మారింది. అయితే ఇలా సెలబ్రిటీలు తమ భావాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వారు ట్రోలింగ్‌కు గురవుతున్నారు. తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ సినిమా హీరో అభిమానులు తరుణ్ తమ హీరో సినిమా గురించే అలా మాట్లాడాడని తరుణ్‌ను ట్రోల్ చేశారు. అదుగో నువ్వు మా హీరోని అనేంత వాడివా అంటూ అతనిపై ఆన్‌లైన్ యుద్ధానికి దిగారు.
దీనిపై తరుణ్ భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు తనను తిట్టడంతో పాటు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్న తరుణ్, తనను వేధించిన వారు ఫోన్ నెంబర్స్, ఐడీ నెంబర్స్‌ను పోలీసులకు ఫిర్యాదుతో పాటు అందించారు. తాను కంప్లైంట్ చేసిన విషయాన్ని కూడా తరుణ్ భాస్కర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.‘పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది’ సినిమాలు డైరెక్ట్ చేసిన తరుణ్ గతేడాది ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో హీరోగానూ మారాడు.
Read:శ్రీలంకలో షోలు చేశా.. నటనకు దూరం కాలేదు.. మళ్లీ వస్తున్నా- ఇషా చావ్లా