Vivek Agnihotri : చనిపోయిన వారికి కనీసం గౌరవమివ్వండి.. ‘కశ్మీర్ ఫైల్స్’పై వస్తున్న విమర్శలకు కౌంటర్
తాజాగా ఈ విమర్శల్లో మరో అంశానికి తెరతీశారు. ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)లో సభ్యుడు కావడంతో ఎలాంటి కట్ లేకుండా సినిమాని యధాతథంగా.........

Vivek
The Kashmir Files : 1990లలో పాకిస్థాన్, ఉగ్రవాదులు కలిసి కశ్మీర్ లో హిందువులపై చేసిన మారణకాండ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఎలాంటి అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్ తో నిర్మించబడిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కేవలం మౌత్ టాక్ తోనే భారీ విజయం సాధించి ఇప్పటికే 140 కోట్ల కలెక్షన్స్ సాధించి 200 కోట్లకు దూసుకుపోతుంది.
‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన వారంతా కంటతడి పెడుతున్నారు. నరేంద్రమోడీతో సహా పలువురు సెలబ్రిటీలు, ప్రేక్షకులు ఈ సినిమాని, చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు. పళ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు కొంతమంది మాత్రం సినిమాని విమర్శిస్తున్నారు. తాజాగా ఈ విమర్శల్లో మరో అంశానికి తెరతీశారు. ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)లో సభ్యుడు కావడంతో ఎలాంటి కట్ లేకుండా సినిమాని యధాతథంగా రిలీజ్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ని అభినందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి
ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై వస్తున్న విమర్శలకి సమాధానంగా సినిమా బృందం మాట్లాడటమే కాకుండా ప్రేక్షకుల్లో పలువురు కాశ్మీర్ పండిట్లు కూడా తమకి నిజంగా జరిగిన చరిత్ర అంటూ మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టారు. ఇప్పుడు వచ్చిన ఈ విమర్శలపై సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్లో ఇలాంటి వార్తని షేర్ చేసి.. ”కావాలని కొంతమంది సినిమాపై దుష్ప్రచారం కలిపిస్తున్నారు. దయచేసి ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఆపేయండి. కాస్త విరామం తీసుకోండి. కనీసం కశ్మీర్ లోయలో ఆ మారణకాండలో చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి’ అని ట్వీట్ చేశారు.
Please stop spreading fake news, like always. Take a little break. At least to respect the dead. https://t.co/hZflsTUbOk pic.twitter.com/yvOKhGieDX
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 20, 2022