Peddi : మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా బ‌ర్త్ డే.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే పోస్ట‌ర్..

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది.

Peddi : మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ మున్నా భయ్యా బ‌ర్త్ డే.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే పోస్ట‌ర్..

Divyendu Sharma birthday special poster from peddi movie

Updated On : June 19, 2025 / 11:06 AM IST

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ పెద్ది. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జాన్వీక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రంలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ఓ కీల‌క పాత్రలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు ఆయ‌న ప‌ట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర బృందం ఓ విషెస్ తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ను పంచుకుంది.

క్రికెట్ బాల్‌ ప‌ట్టుకుని బౌలింగ్ చేసేందుకు సిద్ధం అయిన‌ట్లుగా దివ్యేందు శర్మ క‌నిపిస్తున్నాడు. ఆయ‌న లుక్ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Satya Sri : ఆ సినిమా రిలీజ్ అయ్యాక పోలీసులు ఫోన్ చేసి తిట్టారు.. అప్పటికి నేను వద్దన్నా.. కానీ శేఖర్ మాస్టర్..

ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తుండ‌గా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, జగపతిబాబు త‌దిత‌రులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 27 ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.