DJ Tillu: మళ్లీ లొల్లి షురూ చేస్తోన్న డీజే టిల్లు!
ఈ ఏడాదిలో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే సక్సెస్ అందుకున్న మూవీ ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా.....

Dj Tillu Sequel Movie Launched Officially
DJ Tillu: ఈ ఏడాదిలో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే సక్సెస్ అందుకున్న మూవీ ‘డీజే టిల్లు’. సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి జనం ఫిదా అయ్యారు. తెలంగాణ యాసలో హీరో చెప్పిన డైలాగులకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ మూవీగా నిలిచింది.
DJ Tillu: సిద్దూ డీజే రచ్చ.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
ఇక ఈ సినిమాను దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించగా, సిద్ధూ స్వయంగా ఈ సినిమాకు మాటలు అందించాడు. ఇక ఈ సినిమాలో హీరో కామెడీకి అందాల భామ నేహా శెట్టి అందాల ఆరబోత తోడవడంతో ఈ సినిమాను యూత్ మళ్లీ మళ్లీ చూశారు. కేవలం ఫస్ట్ వీక్‌లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవడంతో, ఈ సినిమా నిర్మాతలకు అధిక లాభాలు వచ్చిపడ్డాయి. ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఖచ్చితంగా ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
DJ Tillu: థియేటర్లలో డీజే రీసౌండ్.. కలెక్షన్ల మోతమోగిస్తున్న టిల్లు
అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి ఎట్టకేలకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సీక్వెల్ సినిమాకు కూడా సిద్ధూ మాటలు అందిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో కూడా నేహా శెట్టి మరోసారి హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు నుండి స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
The most awaited Franchise… Gearing up for Round 2 ?
Crazy adventure starts filming in August! ? pic.twitter.com/JX130Z4fpZ
— Naga Vamsi (@vamsi84) June 25, 2022