Raj Nidimoru : సమంత రెండో పెళ్లి చేసుకున్న తెలుగబ్బాయి రాజ్ నిడిమోరు ఎవరు? వీళ్ళ లవ్ స్టోరీ గురించి తెలుసా..?
నేడు పెళ్లి ఫొటోలు షేర్ చేసి అధికారికంగా వారి రిలేషన్ షిప్ ని ప్రకటించారు.(Raj Nidimoru)
Raj Nidimoru
Raj Nidimoru : నటి సమంత నేడు దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకుంది. సమంత చైతన్యతో విడిపోయాక రాజ్ తో ప్రేమలో ఉంది. గత కొన్నేళ్లుగా సమంత – రాజ్ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ లో ఉన్నారు అని వార్తలు వస్తుండగా నేడు పెళ్లి ఫొటోలు షేర్ చేసి అధికారికంగా వారి రిలేషన్ షిప్ ని ప్రకటించారు.(Raj Nidimoru)
సమంత తమిళ అమ్మాయి. మొదట నాగచైతన్య తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోగా ఇప్పుడు రెండో పెళ్లి కూడా తెలుగు అబ్బాయి రాజ్ నిడిమోరుని చేసుకుంది. రాజ్ నిడిమోరు తిరుపతికి చెందిన వాడు. రాజ్ తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు. అనంతరం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసాడు. తనకు సినిమాల మీద ఉన్న ఇష్టంతో తన కాలేజీ ఫ్రెండ్ కృష్ణ(DK)తో కలిసి సినీ పరిశ్రమలోకి వచ్చారు.
Also Read : Samantha : సమంత రెండో పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడ? అందరూ అనుకున్నట్టు అతనితోనే..
Raj Nidimoru
రాజ్ & DK పేరుతో ఈ ఇద్దరూ సినిమాలు, సిరీస్ లు దర్శకులుగా, నిర్మాతలుగా, రచయితలుగా తీయడం మొదలుపెట్టారు. మొదట అమెరికాలోనే ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమా తీసారు రాజ్ & DK. అనంతరం 99, ఇంకోసారి, షోర్ ఇన్ ది సిటీ, D ఫర్ దోపిడీ, ఏ జెంటిల్మన్, స్త్రీ, సినిమా బండి లాంటి సినిమాలు దర్శక నిర్మాతలుగా చేసారు.
అలాగే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కి దర్శక నిర్మాతలుగా వ్యవహరించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు కలిసి మరిన్ని సినిమాలు, సిరీస్ లు తెరకెక్కిస్తున్నారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సీజన్ 2 సమయంలో రాజ్ – సమంతకు పరిచయం అయింది. అప్పటికి సమంత – నాగచైతన్య ఇంకా విడిపోలేదు. ఈ సిరీస్ సమయంలో రాజ్ – సమంత దగ్గరవ్వడం వల్లే నాగచైతన్య – సమంతకు విబేధాలు వచ్చాయని అప్పట్లో టాలీవుడ్ సమాచారం.
Also Read : Actress Hema : మొత్తం ఆ గొట్టం గాడే చేసాడు.. విష్ణు బాబుకి ఫోన్ చేసి.. ‘మా’ లో మెంబర్షిప్ పై హేమ వ్యాఖ్యలు..
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సెకండ్ సీజన్ 2021 జూన్ లో రిలీజ్ అవ్వగా చైతన్య – సమంత అక్టోబర్ 2021లో విడిపోయారు. ఆ సిరీస్ వల్లే, రాజ్ కు సమంత దగ్గర అవ్వడం వల్లే విడిపోయారని, ఆ సిరీస్ సమయంలోనే రాజ్ – సమంతల పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో పలు వార్తలు వచ్చాయి. ఆ సిరిస్ తర్వాత నుంచి సమంత రెగ్యులర్ గా రాజ్ నిడిమోరుతో కలిసి కనిపిస్తుంది. మొదట రూమర్స్ అనుకున్నా గత కొన్నాళ్ళుగా ఇద్దరూ కలిసి తిరగడం, ఫొటోలు పెట్టడం, బిజినెస్ లు చేయడంతో ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయ్యారు. సమంత పరిచయం అయ్యాకే రాజ్ కూడా 2022 లో తన భార్య శ్యామలీ కి విడాకులు ఇచ్చారు.
సమంత గత కొన్నాళ్లుగా ఈషా ఫౌండేషన్, సద్గురుని ఎక్కువగా ఫాలో అవుతుంది. ఈ క్రమంలోనే నేడు రాజ్ నిడిమోరు ని సమంత ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకుంది.
Also Read : Nani : పవన్ కళ్యాణ్ OG సాంగ్.. నాని సినిమాకు టైటిల్ గా.. సుజీత్ సినిమాటిక్ యూనివర్స్..
View this post on Instagram
