ఒక అక్క ఇద్దరు అమ్మలతో సమానం : ఎమోషనల్‌గా ‘దొంగ’- ట్రైలర్

యాంగ్రీ హీరో కార్తి, జ్యోతిక ప్రధానపాత్రలు పోషించిన ఎమోషనల్ ఫిలిం ‘దొంగ’ ట్రైలర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : December 11, 2019 / 05:38 AM IST
ఒక అక్క ఇద్దరు అమ్మలతో సమానం : ఎమోషనల్‌గా ‘దొంగ’- ట్రైలర్

Updated On : December 11, 2019 / 5:38 AM IST

యాంగ్రీ హీరో కార్తి, జ్యోతిక ప్రధానపాత్రలు పోషించిన ఎమోషనల్ ఫిలిం ‘దొంగ’ ట్రైలర్ విడుదల..

‘ఖైదీ’ లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ, వదిన జ్యోతికతో కలిసి నటించిన తమిళ చిత్రం ‘తంబి’ తెలుగులో ‘దొంగ’ పేరుతో విడుదల కానున్నసంగతి తెలిసిందే. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలాల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై ‘దృశ్యం’ ఫేమ్‌ జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

Image

”చిన్నా ఇంకా నా కళ్లలోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఒక్క సంతోషం, ఓదార్పు వాడు మాత్రమే” అంటూ జ్యోతిక ఎమోషనల్‌గా చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘ఎలా ఉందిరా పెర్‌ఫార్మెన్స్‌.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవర్నో పెడుతున్నారు..’ అంటూ తనదైన కామెడీ టైమింగ్‌తో కార్తీ చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు కథకి తగ్గ యాక్షన్‌ కూడా ఉందని తెలుస్తోంది.

Image

ఇక ట్రైలర్‌ చివర్లో.. ”ఇంట్లో ఒక అక్క ఉంటే ఇద్దరు అమ్మలతో సమానం. అది ఎవరికి తెలియకపోయినా.. ఒక తమ్ముడికి బాగా తెలుస్తుంది అక్కా..” అంటూ కార్తీ చెప్పే డైలాగ్‌లో ఆయన ఎమోషన్‌ సింప్లీ సూపర్బ్‌ అనే చెప్పాలి. సత్యరాజ్‌, నికిలావిమల్‌, షావుకారు జానకి తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘దొంగ’ డిసెబంర్ 20న తమిళ్, తెలుగులో భారీగా విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ : ఆర్‌.డి. రాజశేఖర్‌, సంగీతం : గోవింద వసంత, దర్శకత్వం : జీతు జోసెఫ్‌.