Dulquer Salmaan : సీతారామం సీక్వెల్ ఉండదు.. నేను సీక్వెల్స్, రీమేక్స్ చేయను..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ''నేను యాక్టర్ అవ్వకముందే ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రేక్షకుల మెప్పు పొంది, పెద్ద క్లాసిక్ గా నిలిచిన సినిమాలని అసలు టచ్ చేయకూడదు అని..........

Dulquer Salmaan :  సీతారామం సీక్వెల్ ఉండదు.. నేను సీక్వెల్స్, రీమేక్స్ చేయను..

Dulquer Salmaan says there is no sequel for SitaRamam Movie

Updated On : September 18, 2022 / 11:20 AM IST

Dulquer Salmaan :  దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ఒక క్లాసిక్ సినిమాలా నిలిచి మంచి విజయం సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. తరుణ్ భాస్కర్, రష్మిక, భూమిక, సుమంత్ ముఖ్యపాత్రలు పోషించారు.

సౌత్ లో మంచి విజయం సాధించిన సీతారామం సినిమాని ఇటీవలే హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుంటుంది ఈ సినిమా. తాజాగా బాలీవుడ్ లో సీతారామం సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ఇంత గొప్ప విజయం సాధించిన సీతారామం సినిమాకి సీక్వెల్ ఉంటుందా అని ప్రశ్నించగా హీరో దుల్కర్ సల్మాన్ ఆసక్తికరంగా సమాధానం చెప్పాడు.

Sharwanand : ఓ చెడ్డ సినిమా తీసి దాన్ని హిట్ అంటే ప్రేక్షకులని మోసం చేయడమే..

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ”నేను యాక్టర్ అవ్వకముందే ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రేక్షకుల మెప్పు పొంది, పెద్ద క్లాసిక్ గా నిలిచిన సినిమాలని అసలు టచ్ చేయకూడదు అని అనుకున్నాను. అలాగే నేను సీక్వెల్స్, రీమేక్స్ కూడా తీయకూడదు అనుకున్నాను. సీతారామం సినిమా మేము అనుకున్నట్టే మంచి విజయం సాధించి ఒక క్లాసిక్ సినిమాలా నిలిచింది. అటువంటి క్లాసిక్ ని మళ్ళీ టచ్ చేయకూడదని నా అభిప్రాయం. అందుకే సీతారామం సినిమాకి సీక్వెల్ ఉండదనే నేను అనుకుంటున్నాను” అని అన్నారు.