Ravi Teja : రవితేజ బర్త్ డేకి ఈగల్ టీమ్ స్పెషల్ ట్రీట్
మాస్ మహరాజా రవితేజ జనవరి 26న బర్త్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈగల్ మూవీ టీమ్ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది.

Ravi Teja
Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ-కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న ‘ఈగల్’ ‘సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి వస్తోంది. జనవరి 26 రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీం గ్రాండ్ సెలబ్రేషన్స్ చేస్తోంది.
Ashika Ranganath : సిస్టర్ మ్యారేజ్‌లో ఆషికా రంగనాథ్ సందడి.. ఫోటోలు
రవితేజ టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనిని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘ఈగల్’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. సినిమాలు ఎక్కువగా ఉండటం, థియేటర్స్ ఇబ్బందులు రావడంతో సినిమాని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్‌గా ఈగల్ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ కాగా, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, వినయ్ రాయ్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాని నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
కాగా ఈనెల 26న రవితేజ బర్త్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రవితేజకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతోంది. మహమూద్ హౌస్ గ్రాండ్ గార్డెన్, యూసఫ్ గూడాలో రవితేజ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరగబోతున్నాయి. ఈ విషయాన్ని పీపుల్ పీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇక ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమాపై హైప్ పెంచేసాయి. 2023 లో వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్‌లో నటించిన రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలతో ముందుకు వచ్చారు. అవి అంతగా ఆడలేకపోయాయి. ఇక ఈగల్ సినిమా ఎలా ఉండబోతోందన్నది ఫిబ్రవరి 9న తేలనుంది.
View this post on Instagram