ED Raids : మొన్న తెలుగు.. ఇప్పుడు తమిళ్ నిర్మాతల ఆఫీసులపై ED దాడులు.. పొన్నియిన్ సెల్వన్ నిర్మాతలపై..

టాలీవుడ్ పై ED దాడులు చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు తమిళ పరిశ్రమలో ED దాడులు చేయడం చర్చగా మారింది. మంగళవారం మే 16న తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ పై, ఆ సంస్థ నిర్మాతల ఇళ్లపై ED రైడ్స్ చేసి సోదాలు నిర్వహించింది.

ED Raids : మొన్న తెలుగు.. ఇప్పుడు తమిళ్ నిర్మాతల ఆఫీసులపై ED దాడులు.. పొన్నియిన్ సెల్వన్ నిర్మాతలపై..

ED Raids on Lyca Productions in Tamil Industry

Updated On : May 17, 2023 / 8:59 AM IST

Lyca Productions :  అప్పుడప్పుడు సినిమా వాళ్ళ ఆఫీసులు, హీరోలు, నిర్మాతల ఇళ్లపై కూడా ED దాడులు చేస్తుంది. ఇటీవలే తెలుగు పరిశ్రమలోని అగ్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థపై, నిర్మాతల ఇళ్లపై ED దాడులు చేసి, సోదాలు నిర్వహించింది. బ్యాంకు లావాదేవీల్లో తేడాలు ఉన్నట్టు గమనించింది. తెలుగు నిర్మాతల ఆఫీసులపై ED దాడులు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.

టాలీవుడ్ పై ED దాడులు చేసిన కొన్ని రోజులకే ఇప్పుడు తమిళ పరిశ్రమలో ED దాడులు చేయడం చర్చగా మారింది. మంగళవారం మే 16న తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆఫీస్ పై, ఆ సంస్థ నిర్మాతల ఇళ్లపై ED రైడ్స్ చేసి సోదాలు నిర్వహించింది. ప్రస్తుతానికి కొన్ని ఫైళ్లు తీసుకొని లావాదేవీలు చెక్ చేస్తున్నట్టు సమాచారం. వరుసగా మొన్న తెలుగు, ఇప్పుడు తమిళ్ పరిశ్రమలలోని అగ్ర నిర్మాతల ఆఫీసులపై ED దాడులు చేయడం రెండు సినీ పరిశ్రమలలోను చర్చగా మారింది.

2018 Movie : మరో మలయాళ సినిమా సంచలనం.. ఒక్క భాషలోనే 100 కోట్లు..

ఇక లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం లైకా చేతిలో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్.. ఇలా స్టార్ హీరోల సినిమాలతో దాదాపు 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు ఉన్నాయి.