ET: నీకు యాక్టింగ్ కాదురా.. రానాకు 4 గంటలు క్లాస్ పీకిన సూర్య!
భల్లాల దేవుడిగా సౌత్ నుండి నార్త్ వరకు నటుడిగా స్పెషల్ క్రేజ్ దక్కించుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పటికే ఇండియాలోని..

Et
ET: భల్లాల దేవుడిగా సౌత్ నుండి నార్త్ వరకు నటుడిగా స్పెషల్ క్రేజ్ దక్కించుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పటికే ఇండియాలోని దాదాపు అన్ని మేజర్ బాషలలో నటించాడు. అయితే అసలు రానాకు నటనే రాదట. ఏదో అలా సర్ధేస్తున్నాడట. ఈ మాటలు అన్నది కూడా ఎవరో కాదు తమిళ స్టార్ హీరో సూర్య. గతంలో ఒకసారి సూర్య రానాకు యాక్టింగ్ రాదని.. ఏదో మేనేజ్ చేస్తున్నావని గట్టిగా క్లాస్ పీకాడట. ఈ విషయాన్ని కూడా రానానే స్వయంగా చెప్పాడు.
Rana : పవన్ కళ్యాణ్ గారికంటే నేనే ముందు సెలెక్ట్ అయ్యాను ఈ సినిమాలో
సూర్య నటించిన ఈటీ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. నారాయణ్‌దాస్ నారంగ్, డి. సురేష్‌బాబు, దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండగా ఈ సందర్భంగా.. గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు హీరో రానా, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు గోపీచంద్ మలినేని అతిధులుగా హాజరై బిగ్ టికెట్‌ను విడుదల చేశారు.
Rana Daggubati : భళ్లాలదేవ క్రేజ్‌ని ‘బీమ్లా నాయక్’ ఎందుకు వాడట్లేదు??
ఈ వేడుకలో మాట్లాడిన రానా.. నా సినిమా ఒకటి ఎడిటింగ్ రూమ్‌లో చూసిన సూర్యగారు ‘‘నీది యాక్టింగ్ కాదురా.. సర్దేస్తున్నావ్..’ అని క్లాస్ పీకారు. ఆ క్లాసే నన్ను భల్లాలదేవుడిని చేసింది. డేనియల్ శేఖర్‌ని చేసిందని షాకింగ్ విషయాన్ని చెప్పగా.. అప్పటికే స్టేజ్ అంతా నవ్వులు పూస్తుంది. అంతలో సూర్య మైకు తీసుకుని ఇప్పుడు రానాను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సూర్యా చెప్పారు.