RRR: ఆర్ఆర్ఆర్ నుండి రేపు మరో సర్‌ప్రైజ్!
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి....

Ethara Jenda Video Song From Rrr To Be Out Tomorrow
RRR: టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక మార్చి 25న ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కట్టారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా రోజులుగా సందడి చేస్తూ వస్తోంది.
RRR: 31 రోజుల కలెక్షన్స్.. ఆ మార్క్‌కు చేరువలో ఆర్ఆర్ఆర్!
ఇక ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రన్‌ను ముగించుకునేందుకు రెడీ అవుతుండటంతో, టోటల్ రన్‌లో ఈ మూవీ ఎంతమేర వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి పలు వీడియో సాంగ్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, తాజాగా మరో సర్‌ప్రైజ్‌ను ఇచ్చేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అయ్యింది. ఈ సినిమా చివర్లో, టైటిల్ కార్డ్స్ పడే సమయంలో ‘ఎత్తర జెండా’ అనే పాటను పెట్టి ఆడియెన్స్‌ను థ్రిల్ చేశారు చిత్ర యూనిట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
RRR: ట్రిపుల్‌ఆర్ నెవెర్ బిఫోర్ రికార్డ్.. హైదరాబాద్‌లో 46 సెంటర్లలో రూ.46 కోట్లు!
ఎత్తర జెండా పాటను ఏప్రిల్ 26న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్‌లు కలిసి చేసిన డ్యాన్స్, ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇక అందరికీ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా ఈ పాటలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ఇతర వీడియో సాంగ్స్ ఆర్ఆర్ఆర్ సత్తాను యూట్యూబ్‌లోనూ చాటుతుండగా, రేపు విడుదల కానున్న ఎత్తరజెండా కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.
Gear up for the celebration of the decade?#RRRCelebrationAnthem Full Video Song will be out at 4 PM tomorrow
An @MMKeeravaani Musical! #RRRMovie@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @DVVMovies @RRRMovie @LahariMusic @TSeries pic.twitter.com/jRQpbGjIlP
— Lahari Music (@LahariMusic) April 25, 2022