F3 – ఫన్ రైడ్ స్టార్ట్ అయింది..

F3 – ఫన్ రైడ్ స్టార్ట్ అయింది..

Updated On : December 17, 2020 / 1:15 PM IST

F3 – Movie Launched: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, హాట్ బ్యూటీ మెహ్రీన్‌ కౌర్‌ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘ఎఫ్ 2’.. గతేడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిందీ చిత్రం.. ఫన్‌ అండ్ ఫ్రస్టేషన్‌అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది.

ఇప్పుడు మోర్‌ఫన్‌తో.. అదే టీమ్‌తో మరోసారి నవ్వులజల్లు కురిపించడానికి ‘ఎఫ్‌3’ రూపొందనుంది. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి యూనిట్‌ని అభినందించారు.

తమన్నా, వరుణ్ తేజ్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అరవింద్ క్లాప్ నిచ్చారు. డిసెంబర్ 23 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

F3 Movie

F3 Movie

F3 Movie