Divya Spandana: కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన‌కు ఏమైంది..? చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు

జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ట్విటర్ వేదికగా సకాలంలో స్పందించారు. ‘నేను ఇప్పుడు దివ్య స్పందనతో మాట్లాడాను.. ఆమె క్షేమంగా ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. 

Divya Spandana: కన్నడ నటి, మాజీ ఎంపీ దివ్య స్పందన‌కు ఏమైంది..? చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు

Actress Divya Spandana

Updated On : September 6, 2023 / 1:11 PM IST

Actress Divya Pansabana : కన్నడ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్య స్పందనకు ఏమైంది? ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో ఆమె చనిపోయినట్లు పోస్టింగ్‌లు రావడంతో Rip అంటూ కొందరు తమ సంతాపాన్ని‌సైతం ప్రకటించారు. దివ్య స్పందనకు ప్రస్తుతం 40ఏళ్లు. కొందరు వ్యక్తులు ట్విటర్‌లో ఆమె గుండెపోటుతో చనిపోయారంటూ పోస్టు పెట్టారు. ఆ పోస్టు కొద్ది నిమిషాల్లోనే వైరల్ కావడంతో కర్ణాటకతో పాటు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే, నిమిషాల వ్యవధిలోనే ఆ వార్త నిజంకాదని తేలడంతో హమయ్య అంటూ దివ్య స్పందన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ట్విటర్ వేదికగా సకాలంలో స్పందించారు. ‘నేను ఇప్పుడు దివ్య స్పందనతో మాట్లాడాను.. ఆమె క్షేమంగా ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు.

 

 

Parineeti Chopra-Raghav Chadha : పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా మ్యారేడ్ డేట్ ఫిక్స్? డెస్టినేషన్ ఎక్కడంటే..

దివ్య హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో శింబు, ధనుష్, సూర్య, తదితర హీరోల సరసన హీరోయిన్ గా నటించారు. ఆమె ఇండస్ట్రీలో కత్తు రమ్య పేరుతో పాపులర్ అయ్యారు. ధనుష్ తో పొల్లదవన్ సినిమాలో నటించారు. తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించారు. కన్నడ, తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో ఆమె నటించారు.

 

 

Watermelons : వామ్మో ..అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, అసలేం జరుగుతోంది..?

2013 ఉప ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా నియోజక వర్గం నుంచి బరిలో నిలిచి దివ్య స్పందన విజయం సాధించారు. అయితే, ఆ తరువాత ఏడాదిలో జరిగి సాధారణ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్‌లో ఆమె కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో ముఖ్యురాలిగానూ  గతంలో ఆమె గుర్తింపు పొందారు.