Peshan : డైరెక్టర్ గా మారిన ఫ్యాషన్ డిజైనర్.. ఫ్యాషన్ కాలేజీలలో షూట్ చేస్తున్న ‘పేషన్’..

ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన అరవింద్ జోషువా ఇప్పుడు పేషన్ సినిమాతో దర్శకుడిగా మారారు.

Peshan : డైరెక్టర్ గా మారిన ఫ్యాషన్ డిజైనర్.. ఫ్యాషన్ కాలేజీలలో షూట్ చేస్తున్న ‘పేషన్’..

Fashion Designer Aravind Joshuva Turned as Director with Peshan Movie

Updated On : June 2, 2024 / 10:57 AM IST

Peshan : సుధీష్ వెంకట్, అంకిత సాహ, శ్రేయాసి షా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘పేషన్’. బిఎల్ఎన్ సినిమా, రెడ్ యాంట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అరుణ్ కుమార్ మొండితోక, నరసింహ యేలె, ఉమేష్ చిక్కు నిర్మాణంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకత్వంలో ఈ పేషన్ సినిమా తెరకెక్కుతుంది. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

స్టార్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల, మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి.. లాంటి పలువురు డైరెక్టర్స్ వద్ద ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసిన అరవింద్ జోషువా ఇప్పుడు పేషన్ సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రస్తుతం పేషన్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ లోని పలు ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలుకానుంది.

Also Read : Meera Jasmine : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. ఆ హీరో సినిమాతో..

ఈ సందర్భంగా దర్శకుడు అరవింద్ జోషువా మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని పలు ఫ్యాషన్ కాలేజీలలో 20 రోజుల పాటు షూటింగ్ చేశాం. రెండవ షెడ్యూల్ మొదలు కాబోతుంది. ఫ్యాషన్ ప్రపంచానికి సంబంధించి ఇంతకుముందు ఎప్పుడూ రాని టెక్నికల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఈ తరహాలో రాబోయే మొదటి సినిమా మా పేషన్ అని చెప్పొచ్చు. ప్రేమ, ఆకర్షణకి సంబంధించి యువతలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి మా పేషన్ సినిమా సమాధానం చెప్తుంది అని తెలిపారు.