Theatrical Releases : ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం రెండు డైరెక్ట్ సినిమాలు ఉండగా, రెండు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. వీటితో పాటు ఓ సినిమా రీ రిలీజ్ కానుంది.

Theatrical Releases : ఈ వారం థియేటర్స్‌లో తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే..

February Second Week Theatrical Releasing Movies

Updated On : February 5, 2024 / 1:41 PM IST

Theatrical Releases : గత శుక్రవారం ఒకేసారి చాలా చిన్న సినిమాలు రిలీజయ్యాయి. దాదాపు 10 సినిమాలు రిలీజవ్వగా వాటిల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒక్కటే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం రెండు డైరెక్ట్ సినిమాలు ఉండగా, రెండు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. వీటితో పాటు ఓ సినిమా రీ రిలీజ్ కానుంది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా ఫిబ్రవరి 7న రీ రిలీజ్ కానుంది. పవన్ అభిమానులు థియేటర్స్ లో ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రెడీ అయ్యారు.

Image

వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాకు సీక్వెల్ గా మహి వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ జగన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ‘యాత్ర 2′(Yatra 2) సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది.

Image

రవితేజ, కావ్య థాపర్ జంటగా అనుపమ పరమేశ్వరన్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, వినయ్ రాయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఈగల్'(Eagle). ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

Image

రజినీకాంత్ ముఖ్య పాత్రలో విష్ణు విశాల్ హీరోగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ సినిమా ‘లాల్ సలామ్'(Lal Salaam). ఈ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నారు.

Image

మణికందన్, గౌరీప్రియ జంటగా తమిళ్ లో తెరకెక్కిన లవర్ సినిమా తెలుగులో ‘ట్రూ లవర్'(True Lover)గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తమిళ్ లో ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుండగా, తెలుగులో మాత్రం ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతుంది.

 

Image