BiggBoss Non Stop : గొడవలు పోయి కొట్టుకునేదాకా వెళ్లిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్

బిగ్‌బాస్ లో మొదటి కెప్టెన్ గా వారియర్స్ సైడ్ నుంచి తేజస్వి ఎన్నికైంది. తాజాగా హౌస్ లో రెండో కెప్టెన్ కోసం టాస్కులు నడుస్తున్నాయి. ఈ రెండో కెప్టెన్సీ పోటీలో తగ్గేదేలే అంటూ.........

BiggBoss Non Stop : గొడవలు పోయి కొట్టుకునేదాకా వెళ్లిన బిగ్‌బాస్ కంటెస్టెంట్స్

Biggboss

Updated On : March 10, 2022 / 3:57 PM IST

BiggBoss Non Stop :  బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ మొదటి వారం అయిపోయి రెండో వారం సాగుతుంది. ఇప్పటికే ఒకరు ఎలిమినేట్ అయ్యారు షో నుంచి. ఇక బిగ్‌బాస్ షోలో ఈ సారి మొదటి నుంచి కూడా గొడవలు, పగలు, ఏడుపులు ఉన్నాయి. ఆ గొడవలతో ఇప్పటికే బిగ్‌బాస్ ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సారి మరింతముందుకు వెళ్లి కొట్టుకునేదాకా వెళ్లిపోయారు కంటెస్టెంట్స్. పాత కంటెస్టెంట్స్ వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ చాలెంజర్స్ గా గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి గేమ్ అంతా వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ అన్నట్టే నడుస్తుంది.

బిగ్‌బాస్ లో మొదటి కెప్టెన్ గా వారియర్స్ సైడ్ నుంచి తేజస్వి ఎన్నికైంది. తాజాగా హౌస్ లో రెండో కెప్టెన్ కోసం టాస్కులు నడుస్తున్నాయి. ఈ రెండో కెప్టెన్సీ పోటీలో తగ్గేదేలే అంటూ స్మగ్లర్లు, పోలీసులు అన్నట్టు ఓ టాస్క్ ఇచ్చారు. ఇందులో వారియర్స్‌ సభ్యులు స్మగ్లర్లుగా మారగా చాలెంజర్స్‌ పోలీసుల్లా మారారు. స్మగ్లర్లను అడ్డుకునేందుకు పోలీసులు డోర్‌ దగ్గరే ఉండిపోవడంతో గొడవలు మొదలయ్యాయి.

Prabhas : ఆ ఫైట్‌లో నిజంగానే వీపు మీద కర్రతో కొట్టారు

దీంతో ఈ గొడవల్లో శ్రీరాపాకకి తలకి దెబ్బ తగిలింది. ఆ తర్వాత మహేష్ విట్టా, ఆర్జే చైతూ ఒకరి మీదకి ఒకరు కొట్టుకోవడానికి వెళ్లిపోయారు. మరోపక్క నటరాజ్‌ మాస్టర్‌ కొట్టేసుకుందాం అన్నావ్‌ కదా రా అంటూ యాంకర్‌ శివ మీదకెళ్లాడు. వీళ్లిద్దరు ఒకరిమీదకి ఒకరు కొట్టేసుకోడానికి వెళ్లారు. దీంతో అక్కడున్నవాళ్లు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. మరి ఈ సారి టాస్కులో ఎవరు గెలుస్తారో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.