అక్టోబర్ 22న కొమురం భీమ్ ఫస్ట్‌లుక్

అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుండి కొమురం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న తారక్ ఫస్ట్‌లుక్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది..

  • Published By: sekhar ,Published On : September 22, 2019 / 06:55 AM IST
అక్టోబర్ 22న కొమురం భీమ్ ఫస్ట్‌లుక్

Updated On : September 22, 2019 / 6:55 AM IST

అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుండి కొమురం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న తారక్ ఫస్ట్‌లుక్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది..

ఆర్ఆర్ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ అండ్ పాన్ ఇండియా మూవీ.. ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని లీడ్ రోల్స్ చేస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై  దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

ఇటీవలే బల్గేరియాలో తారక్‌పై కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. షూటింగ్ అయితే జరుగుతోంది కానీ యూనిట్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని తారక్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15కి అయినా భీమ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారు.. కానీ మూవీ టీమ్ చప్పుడు చెయ్యలేదు.

Read Also : షూటింగ్‌లో చిన్నారులతో సాయి ధరమ్ తేజ్..

ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ డేట్ అప్‌డేట్ తెలిసింది. అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుండి కొమురం భీమ్ క్యారెక్టర్ చేస్తున్న తారక్ ఫస్ట్‌లుక్ విడుదల చెయ్యనున్నారని తెలుస్తుంది. 2020 జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్.