‘జీనా హై తో మర్నా సీఖో’ : జార్జ్ రెడ్డి – ట్రైలర్
సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో నటిస్తున్న‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) .. థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో నటిస్తున్న‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) .. థియేట్రికల్ ట్రైలర్ విడుదల..
చరిత్ర మరచిపోయిన లీడర్ జీవితాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. ఆ లీడర్ ఎవరో కాదు.. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) ..
సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. దసరా సందర్భంగా జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేశారు. వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి, శత్రు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. ఆర్ఆర్, విజువల్స్ బాగున్నాయి. ఉస్మానియాలో ఉన్న సమయంలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పి.డి.యస్.యు) స్థాపించారు.
Read Also : ‘వేట నేర్పుతా రారా అల్లుడు’ : వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్!
పి.డి.యస్.యు భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో.. 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి జార్జ్ రెడ్డిని హత్య చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. కెమెరా : సుధాకర్ యెక్కంటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్ష వర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాత : సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.