RRR: గెట్ రెడీ.. ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇక రచ్చ రచ్చే!

తెలుగు సినిమాకి మళ్ళీ పాత రోజులు వచ్చేస్తున్నాయి. అఖండతో మొదలైన సినిమా జాతరను కొనసాగించేందుకు మిగతా స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్, తారక్-చరణ్, పవన్ కళ్యాణ్..

RRR: గెట్ రెడీ.. ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇక రచ్చ రచ్చే!

Rrr Trailer Update

RRR: తెలుగు సినిమాకి మళ్ళీ పాత రోజులు వచ్చేస్తున్నాయి. అఖండతో మొదలైన సినిమా జాతరను కొనసాగించేందుకు మిగతా స్టార్ హీరోలు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్, తారక్-చరణ్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఇలా వరసగా ఒక్కొక్కరు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఎన్ని సినిమాలున్నా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకులు అంతకు మించి అనేలా అంచనాలు పెట్టేసుకున్నారనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకి సమయం ఆసన్నమవుతుంది.

Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

జనవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే యూనిట్ భారీ ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన లుక్స్, గ్లింప్స్, లిరికల్ వీడియోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కాగా.. సినిమా ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ముందుగా ట్రైలర్ తో ప్రమోషన్ తో పాటు ఆర్ఆర్ఆర్ రచ్చ మొదలు పెట్టాలని చూస్తున్న జక్కన్న అందుకు ముహూర్తం కూడా పెట్టేసినట్లు తెలుస్తుంది. ముందుగా ఈ రోజే (డిసెంబర్ 3) ట్రైలర్ విడుదల చేయాలని అనుకున్నా సిరివెన్నెల ఆకస్మిక మరణంతో ఇది వాయిదా పడింది.

Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

కాగా.. ఇప్పుడు ట్రైలర్ కోసం మరో ముహూర్తం పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ సిద్ధం కాగా.. ఈనెల 7 లేదా 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వదిలేందుకు సిద్దమవుతున్నారట. ఈ మేరకు ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన కూడా వచ్చేయనుంది. జనవరి 7 సినిమా అంటే సరిగ్గా నెలరోజులు సినిమా విడుదలకు కౌంట్ డౌన్ మొదలు కానుండగా.. ఈ నెల రోజులు సినిమా ప్రచారం హోరెత్తించనున్నారు. మిగతా పాటలతో పాటు నేషనల్ లెవల్ లో మేకర్స్ ఇంటర్వూలు కూడా ప్లాన్ చేయనున్నారు.