NTR : డ్రాగన్ కోసం ఎన్టీఆర్‌కు భారీ రెమ్యూనరేషన్.?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్స్ ఉన్నాయి

Gossip Garage NTR Remuneration For Dragon Movie
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్స్ ఉన్నాయి. సలార్, కేజీఎఫ్ వంటి సినిమాల్లో హీరోలకు ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇచ్చి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్..డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్‌ను ఫ్రీడమ్ ఫైటర్ రోల్‌లో చూపించబోతున్నాడట.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీకి ఎన్టీఆర్ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రూ.100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొన్ని ఏరియాల్లో లాభాల్లో 25 శాతం వాటా కూడా డిమాండ్ చేశారని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ను గ్రాండ్‌గా ప్రెజెంట్ చేయడానికి ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదట.
Rajamouli : మరో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న జక్కన్న..
డ్రాగన్ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ మూవీలో తన స్టైల్‌ను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్‌ను ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేసే సన్నివేశాలతో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ చిత్రంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్‌గా నడుస్తోందట. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో డ్రాగన్ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు. హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. వార్-2 మూవీ ఆగస్ట్ 14న విడుదల కానుంది.